నోరూరిస్తుంది : కూల్ కూల్ టేస్టీ ‘ఐస్ క్రీమ్’ మ్యూజియం

ఐస్ క్రీమ్ మ్యూజియం.ఏంటీ ఐస్ క్రీమ్ ల కోసం ఓ మ్యూజియమా అని ఆశ్చర్యపోవచ్చు. ఈ మ్యూజియంలో ఎక్కడ చూసి ఐస్ క్రీమ్ లే కనిపిస్తాయి. ఎన్నో రంగులు..మరెన్నో రుచులు. ఎక్కడా దొరకని టేస్టులు ఈ మ్యూజియంలో దొరుకుతాయి.
ఈ ఐస్ క్రీమ్ మ్యూజియానికి వెళ్లాలంటే అమెరికా వెళ్లాల్సిందే. శానిఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్, మాయామి ప్రాంతాలలో ఈ ఐస్ క్రీమ్ లను ప్రారంభించారు. ఈ మ్యూజియల్లోకి అడుగు పెట్టగానే అద్భుతమైన ఐస్ క్రీమ్ లోకంలోకి అడుగు పెట్టినట్లే ఉంటుంది. మ్యూజియం లోకి వెళ్లగానే అక్కడ ఐస్ క్రీమ్ డ్రెస్సుల్లో ఉండే బేరర్ కనిపిస్తాడు. మనకు ఐస్ క్రీమ్ వెల్కమ్ చెబుతాడు. లోపలికి వెళ్లగానే గోడలన్నీ స్ట్రా బెర్రీస్ ఐస్ క్రీముల్లా ఉన్నాయి. అంతేకాదు లోపల ఉండే ప్రతీ వస్తువూ ఐస్ క్రీమ్ ల్లానే ఉంటాయి. అక్కడ ఉండే టెలీఫోన్ కూడా ఐస్ క్రీమ్ లానే ఉంటుంది.
అలా లోపలికి వెళ్లగానే ఐస్ క్రీమ్ ఫోన్ చల్లగా రింగ్ అవుతుంది. అవతలివైపు నుంచి ఓ వ్యక్తి హలో..ఇక్కడ ఐస్ క్రీమ్ పార్టీ జరగుతోంది రండి రండి తిందురుగానీ అని వినిపిస్తుంది. గబాగబా వెళ్లితే అక్కడ రూమ్ లో పెద్ద పెద్ద ఐస్ క్రీములు గోడలకు అతుక్కుని ఉంటాయి. అవి తినేవి కావనుకోండి. వాల్స్ ని అలా డెకరేట్ చేశారు. మరోచోట ఐస్ క్రీమ్ లపై చల్లే స్ప్రింకర్లతో ఏకంగా ఓ స్విమ్మింగ్ ఫూల్ లాంటిది ఉంది. దాంట్లో పిల్లలంతా చేరి కేరింతలు కొడుతు ఆడుకుంటుంటారు. అల్లరల్లరి చేసేస్తుంటారు. మరో రూమ్ లో కూర్చునే బెంచీలు..కుర్చీలతో పాటు రూమ్ అంతా ఐస్ క్రీమ్ లాంటి బొమ్మలు ఉంటాయి.
ఏంటీ ఐస్ క్రీమ్ మ్యూజియం అంటే ఐస్ క్రీముల్లాంటి బొమ్మలు మాత్రమే అనుకోవద్దు..అలా అన్నీ చూసుకుంటూ లోపలికి వెళితే …అక్కడ ఉంటాయి అసలు సిసలైన ‘ఐస్ క్రీమ్’లు వాటిని తినాలంటే మన పొట్ట సరిపోదు. ఎక్కడా దొరకని ఫ్లేవర్లతో..డిఫరెంట్ ఐస్ క్రీములన్నీ ఒకేచోట ఉన్నాయి. అదండీ ఐస్ క్రీమ్ మ్యూజియం స్పెషల్..ఏంటీ ఇదంతా తెలుసుకుంటూ ఐస్ క్రీమ్ తినాలని నోరు ఊరుతోందా? అమెరికా వెళ్లాలనిపిస్తోంది కదూ..
ఆ..ఇంతకీ ఈ మ్యూజియం క్రియేటివిటీ ఐడియా మేరీల్లిస్ బన్ అనే వ్యక్తిది. ఈ ఐస్ క్రీమ్ మ్యూజియంలోకి వెళ్లాలంటే..టిక్కెట్ల ధర 39 డాలర్లు.