Hungary : కారులో వెళ్తుంటే ఆ రోడ్డు మ్యూజిక్ ప్లే చేస్తుంది.. ఆ మ్యూజికల్ రోడ్డు ఎక్కడంటే?

జర్నీలో వెళ్తూ మన వెహికల్‌లో సంగీతం వినడానికి ఎంతో ఇష్టపడతాం. మనం వెళ్తున్నప్పుడు రోడ్డు సంగీతం ప్లే చేస్తే.. థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదా.. ఆ మ్యూజికల్ రోడ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Musical Road In Hungary

Musical Road In Hungary : కారులో జర్నీ చేస్తున్నప్పుడు మంచి సంగీతం వినడానికి ఇష్టపడతాం. అయితే మనం వెళ్తుంటే రోడ్డే సంగీతం ప్లే చేస్తే.. భలే ఉందే.. అనుకుంటున్నారా? నిజం. హంగేరీలోని ఓ మ్యూజికల్ రోడ్  డ్రైవర్లు సరైన వేగంతో ప్రయాణించినప్పుడు పాటలను ప్లే చేస్తుంది.

Japan : తెలుగు సినిమాలకు కొత్త మార్కెట్ జపాన్.. మన సినిమాలపై కోట్లు కురిపిస్తున్న జపాన్ అభిమానులు..

@historyinmemes అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ అవుతున్న ఓ వీడియో పాతదే అయినా మళ్లీ తెరపైకి వచ్చింది. హంగేరీలోని మ్యూజికల్ రోడ్ పాటలను ప్లే చేస్తోంది. వీడియోలో హంగేరీస్ రోడ్ నంబర్ 67 లో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఇదే మ్యూజికల్ రోడ్. సరైన వేగంతో కారు వెళ్తున్నప్పుడు మ్యూజిక్ వినిపిస్తుంది. ఇది కపోస్వర్ సిటీని M7 మోటార్ వేని కలిపే ప్రధాన రహదారి. రిపబ్లిక్ బ్యాండ్ ప్రముఖ గాయకుడు లాస్లో బోడి అకా సిపో జ్ఞాపకార్థం ఈ రహదారిని ఏర్పాటు చేశారట. వాహనం రోడ్డు పక్కకు నడుపుతున్నప్పుడు  బ్యాండ్ నుండి ‘రోడ్ 67’ పాట 30 సెకండ్ల స్పిప్పెట్ వినిపిస్తుంది.

Hungary : శంకర్ మహదేవన్ మనసు దోచుకున్న హంగేరీ హోటల్ మేనేజర్ .. ఇంతకీ అతనేం చేశాడో చూడండి

ఇక్కడ ఒక్కచోటే కాదు.. ప్రపంచంలో జపాన్ అంతటా ఇటువంటివవి 30 రహదారులున్నాయట. ఈ రోడ్లన్నీ జపాన్ సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తూ సంగీతం ప్లే చేస్తాయట. ఇక దక్షిణ కొరియా, USA, ఇండోనేషియా, ఫ్రాన్స్, డెన్మార్క్‌లలో కూడా ఇలాంటి రహదారులు ఉన్నాయట. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తాము చూసిన చక్కని వీడియోలలో ఇది ఒకటిగా చెబుతూ కామెంట్లు చేశారు.