Elon Musk buy Twitter: ఐదేళ్ల కిందట నెటిజన్ సవాల్.. ట్విట్టర్‌ను కొనేసిన మస్క్.. Viral Post

డేవ్ స్మిత్, ఎలాన్ మస్క్ మధ్య ఆనాడు ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ సంభాషణ నేడు మస్క్ ట్విట్టర్ కొనుగోలు అనంతరం తిరిగి ట్విట్టర్లోనే వైరల్ అయింది.

Elon Musk buy Twitter: ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్..సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలుచేశారు. సుమారు రూ.3.32 లక్షల కోట్లు వెచ్చించి ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు మస్క్. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మంగళవారం ప్రపంచ వ్యాప్తంగా టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా 4వ వేవ్, రష్యా యుక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది ట్వీట్ చేసింది కూడా మస్క్ ట్విట్టర్ లావాదేవీ గురించే కావడం మరో విశేషం. అదే సమయంలో మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై సోషల్ మీడియాలో సాధారణ ట్వీట్స్ కంటే మీమ్స్ ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. అయితే ట్విట్టర్ కొనుగోలుపై ఐదేళ్ల క్రితమే మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఏదో సరదాకి చేసిన ఆ ట్వీట్ నిజంగా సాధ్యమౌతుందని మస్క్ సైతం ఊహించి ఉండడు.

Also read:Kate Orchard : యుద్ద విమానం నడిపిన 99 ఏళ్ల మహిళ..ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..

వివరాల్లోకి వెళితే..సోషల్ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు వంటి అంశాలపై ఐదేళ్ల క్రితం(2017లో) ట్విట్టర్ వేదికగా ఒక చర్చ జరిగింది. “twitter ప్లాట్‌ఫారమ్ భావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహిస్తుందని, కానీ ఇతరులు మాత్రం అది ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీస్తుందని మరియు ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు” అనేది ఆ చర్చ సారాంశం. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ..”I Love Twitter” అంటూ ట్వీట్ చేశారు.

Also read:Donald Trump : మస్క్ మంచోడు.. నా ‘ట్రూత్’ నాకుంది.. ట్విట్టర్‌లోకి రానన్న ట్రంప్..!

మస్క్ ఆనాటి ట్వీట్ పై డేవ్ స్మిత్ అనే ట్విట్టర్ వినియోగదారుడు స్పందిస్తూ..”అయితే మీరు ట్విట్టర్ కోనేయండి” అంటూ ట్వీట్ చేశారు. స్మిత్ ట్వీట్ పై అప్పుడే స్పందించిన మస్క్..”ఏంతేంటి(How much is it?) అంటూ బదులిచ్చారు. డేవ్ స్మిత్, ఎలాన్ మస్క్ మధ్య ఆనాడు ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ సంభాషణ నేడు మస్క్ ట్విట్టర్ కొనుగోలు అనంతరం తిరిగి ట్విట్టర్లోనే వైరల్ అయింది. దీనిపై డేవ్ స్మిత్ మంగళవారం స్పందిస్తూ..”సంభాషణ అప్పటి నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవగా..ట్విట్టర్ వినియోగదారులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

Also read:Elon Musk: మస్క్ ట్విటర్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు.. ఏవేం మార్పులు చేయబోతున్నాడు..

ట్రెండింగ్ వార్తలు