Elon Musk: మస్క్ ట్విటర్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు.. ఏవేం మార్పులు చేయబోతున్నాడు..

ట్విటర్ చేతులు మారింది. ఎట్టకేలకు ఎలోన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. సుమారుగా $44 బిలియన్లుతో ట్విటర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్నాడు. మస్క్ ట్విటర్‌లో 9.2శాతం వాటాను కొనుగోలు చేసినప్పటి ....

Elon Musk: మస్క్ ట్విటర్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు.. ఏవేం మార్పులు చేయబోతున్నాడు..

Twitter

Elon Musk: ట్విటర్ చేతులు మారింది. ఎట్టకేలకు ఎలోన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. సుమారుగా $44 బిలియన్లుతో ట్విటర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్నాడు. మస్క్ ట్విటర్‌లో 9.2శాతం వాటాను కొనుగోలు చేసినప్పటి నుండి మాస్క్, ట్విటర్ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. మస్క్ కంపెనీలో 100శాతం వాటాను పొందాలని, దానిని ప్రైవేట్‌గా తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు ఇప్పుడు స్పష్టమైంది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మస్క్ యొక్క బిలియన్ డాలర్ ఒప్పందాన్ని ఒక వారం పాటు చర్చలు జరిపిన తరువాత విక్రయానికి అంగీకరించింది. ప్రారంభంలో CEO పరాగ్ అగర్వాల్, బోర్డు మొదట్లో మస్క్ టేకోవర్‌కు కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే అందులోని మిగిలిన వాటాదారుల నుండి వచ్చిన ఒత్తిడి మస్క్‌కు అనుకూలంగా మారింది. దీంతో టెస్లా సీఈవో ఇప్పుడు ట్విట్టర్ యజమానిగా మారిపోయాడు.

Twitter CEO Parag : మస్క్ మైండ్ గేమ్.. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌‌ను తొలగిస్తాడా? అతడికి ఎలాన్ ఎంత చెల్లించాలంటే?

ప్రస్తుతం అందరి చూపు ట్విటర్‌‍లో మస్క్ ఎలాంటి మార్పులు చేస్తారనేదానిపై ఉంది. ట్విటర్‌లో వాటాలను కొనుగోలు చేయడం ప్రారంభించిన సమయంలో.. వాటా కొనుగోలు గోప్యంగా ఉంచుతూనే ట్విటర్ పై మస్క్ విమర్శల దాడి ప్రారంభించారు. వాక్ స్వాతంత్ర్యానికి ట్విటర్ కట్టుబడి ఉందా? అని పోల్ నిర్వహించారు. కొత్త వేదిక కావాలా? అని యూజర్లను ప్రశ్నించారు. ఇదే క్రమంలో ఎడిట్ బాటన్ ఉండాలని భావిస్తున్నారా అంటూ యూజర్లను మస్క్ ప్రశ్నించారు. ట్విటర్ పై విశ్వసనీయతను మరింత పెంచేలా మార్పులు చేర్పులు ఉండాలని మాస్క్ భావించారు. తాజాగా ట్విటర్ పూర్తిగా మస్క్ సొంతమైంది. మస్క్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేయడంతో ట్విట్టర్ ప్రైవేట్ కంపెనీగా మారింది. దీంతో మస్క్ యొక్క ట్విట్టర్ ఒప్పందానికి సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే మద్దతు ఇచ్చారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం ప్లాట్‌ఫారమ్‌కు సరైన దిశలో ఒక అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Twitter CEO Parag : మస్క్ మైండ్ గేమ్.. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌‌ను తొలగిస్తాడా? అతడికి ఎలాన్ ఎంత చెల్లించాలంటే?

ఏఫ్రిల్ ప్రారంభంలో మస్క్ ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశాడు. దీంతో కంపెనీలో రెండో అతిపెద్ద వాటాదారుగా నిలిచాడు. ట్విట్టర్‌లో 10.3 శాతం వాటాతో వాన్‌గార్డ్ మొదటిది. ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ ప్లాట్‌ఫారమ్‌ను ఇప్పటికంటే మెరుగ్గా చేయాలనుకుం టున్నట్లు చెప్పాడు. మస్క్ వాంకోవర్‌లో జరిగిన TED 2022 కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇది డబ్బు సంపాదించడానికి ఒక మార్గం కాదని స్పష్టం చేశాడు. నా బలమైన సహజమైన భావన ఏమిటంటే, అధికశాతం మంది ప్రజలు విశ్వసించే, విస్తృతంగా భాగస్వాములై ఉండే పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. ట్విటర్లో కొన్ని సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలను సెన్సార్ చేసినందుకు బిలియనీర్లు తరచుగా ట్విట్టర్‌ని ప్రశ్నించారు. మస్క్ ఎల్లప్పుడూ ట్విట్టర్ “స్వేచ్ఛా ప్రసంగం” యొక్క ప్రాథమిక సూత్రానికి కట్టుబడి ఉండదని నమ్మాడు. కాబట్టి, మొదటగా, ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్ నియంత్రణ విధానాన్ని మెరుగుపరచడానికి అతను చర్యలు తీసుకుంటాడని యూజర్లు ఆశిస్తున్నారు. దీనికితోడు ఎడిట్ బటన్‌ను త్వరలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ట్విట్టర్ ఎడిట్ బటన్ రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ చాలా ఈజీ.. బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేసుకోండిలా..!

అయితే మస్క్ బాధ్యతలు స్వీకరించే రోజు ఎడిట్ బటన్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఎడిట్ బటన్ మొదట బ్లూ యూజర్‌ల కోసం విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు జరగనున్నాయి. మరోవైపు ప్లాట్‌ఫారమ్ నుండి స్పామ్ ఖాతాలు, స్పామ్‌ బాట్‌లను తీసివేయడానికి ఎలోన్ కూడా చురుకుగా పని చేయాలని భావిస్తున్నారట. అతను స్పామ్‌ బాట్‌లు అత్యంత బాధించే విషయమని భావిస్తున్నాడు. దీనికితోడు మస్క్ ట్విటర్ ను మరింత ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనుకుంటున్నారు. ఇటీవలి TED కాన్ఫరెన్స్ సందర్భంగా ట్విటర్ లో మరింత ఓపెన్ సోర్స్‌గా ఉండాలని, అల్గారిథమిక్‌గా, మాన్యువల్‌గా తెరవెనుక ఎలాంటి తారుమారు ఉండదని మస్క్ చెప్పాడు. గతేడాది రెండో త్రైమాసికం గణాంకాల ప్రకారం ట్విటర్‌కు 20 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 7.7 కోట్ల పైచిలుకు ఉండగా.. భారత్‌లో వీరి సంఖ్య 2.36 కోట్ల స్థాయిలో ఉంది.