Twitter Edit Tweet : ట్విట్టర్‌లో ఎడిట్ బటన్.. మీ ట్వీట్ ఎన్నిసార్లు ఎడిట్ చేశారో తెలిసిపోతుంది.. జాగ్రత్త..!

Twitter Edit Tweet : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ యూజర్లకు కల నెరవేరుతోంది. ఎప్పటినుంచో ట్విట్టర్‌ను పదేపదే అడుగుతున్న Tweet Edit బటన్ ఫీచర్ వచ్చేస్తోంది.

Twitter Edit Tweet : ట్విట్టర్‌లో ఎడిట్ బటన్.. మీ ట్వీట్ ఎన్నిసార్లు ఎడిట్ చేశారో తెలిసిపోతుంది.. జాగ్రత్త..!

Twitter May Never Let You Forget About The Tweets You Have Edited

Twitter Edit Tweet : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ యూజర్లకు కల నెరవేరుతోంది. ఎప్పటినుంచో ట్విట్టర్‌ను పదేపదే అడుగుతున్న Tweet Edit బటన్ ఫీచర్ వచ్చేస్తోంది. ఇంకేముంది Facebook మాదిరిగా ఎన్నిసార్లు అయినా Tweet ఎడిట్ చేసుకోవచ్చులే అనుకుంటున్నారా? అయితే ఆగండి.. ఇప్పటివరకూ ట్విట్టర్ లో ఎడిట్ బటన్ అందుబాటులో లేదు. ఒకసారి ట్వీట్ చేస్తే అలానే ఉండిపోతుంది. అది తప్పుగా ట్వీట్ చేసినా అంతే.. ఎడిట్ చేయడం కుదరదు.. కావాలంటే ఆ ట్వీట్ డిలీట్ చేసి.. కొత్తగా ట్వీట్ చేయాల్సిందే.. కొత్తగా ఎడిట్ బటన్ వస్తే.. ట్విట్టర్ యూజర్లు ట్వీట్ చేసే ప్రతి ట్వీట్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోవద్దు.. మీరు ట్వీట్ ఒకసారి పోస్టు చేసిన తర్వాత ఆ ట్వీట్.. మీరు ఎన్నిసార్లు ఎడిట్ చేశారో తెలిసిపోతుంది. అంతేకాదు.. ఎడిట్ చేసిన ప్రతి అక్షరం ట్విట్టర్ రికార్డు చేస్తుంది. అది కూడా మీకూ చూపిస్తుంది. సో.. మీరు ఏదైనా తప్పుగా ట్వీట్ చేసి ఎవరూ చూడలేదులే అనుకుంటే పొరపాటే.. మీ ప్రతి ట్వీట్ ఎడిటింగ్ రికార్డు అయిపోతుందని అసలే మర్చిపోవద్దు అంటోంది ట్విట్టర్..

Read Also :  Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ చాలా ఈజీ.. బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేసుకోండిలా..!

కొన్నేళ్ల క్రితం.. మైక్రో-బ్లాగింగ్ సైట్ Twitter ఎప్పటికీ ఎడిట్ బటన్‌ తీసుకురాదని మాజీ ట్విటర్ CEO జాక్ డోర్సే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్విట్టర్ అది తప్పు అని ప్రకటిస్తూ ట్విట్టర్ కొత్తగా ట్విట్టర్ ఎడిట్ బటన్ తీసుకొస్తోంది. వాస్తవానికి ట్విట్టర్ ఎప్పటినుంచో ఎడిట్ బటన్ పై పనిచేస్తోంది. అందిన డేటా ప్రకారం.. మీరు ఎడిట్ బటన్‌ ద్వారా మార్చిన ట్వీట్ల రికార్డులన్నింటిని మీకు కిందనే చూపిస్తుంది ట్విట్టర్. మీరు తప్పుగా ట్వీట్ చేసిన సంగతి మీరు మర్చిపోవచ్చు కానీ, ట్విట్టర్ ఎప్పటికీ మరవదు.. అంటే.. మీరు ట్వీట్ చేసిన తర్వాత అదే ట్వీట్ ఎడిట్ చేయాలనుకుంటే.. అప్పుడు ట్విట్టర్ మీకు కొత్త ట్వీట్ బాక్స్ క్రియేట్ చేస్తుంది.. అక్కడ మీ ట్వీట్ ఎడిట్ చేయొచ్చు. ఆపై పాత ట్వీట్‌తో పాటు కొత్తగా ఎడిట్ చేసిన ట్వీట్ కూడా అక్కడే కనిపిస్తుంది అనమాట.. పాత ట్వీట్‌కు కొత్త ట్వీట్ యాడ్ అవుతుంది. అది క్లిక్ చేయగానే మీరు ఎన్నిసార్లు ఆ ట్వీట్ ఎడిట్ చేశారో అన్ని రికార్డులు అక్కడే యాడ్ అవుతుంటాయి. మీరు ట్వీట్‌లో చేసిన మార్పులను మీరు మరిచినా Twitter వాటిని ఎప్పటికీ మర్చిపోదని దీని అర్థం.

Twitter May Never Let You Forget About The Tweets You Have Edited (1)

Twitter May Never Let You Forget About The Tweets You Have Edited 

ఇక్కడ మనకు స్పష్టంగా తెలియనది ఒకటి ఉంది.. ట్విట్టర్ ఎందుకు ఇలా ఎడిటెడ్ ట్వీట్లను రికార్డు చేస్తుంది.. ట్విట్టర్ తన సొంత ప్రయోజనాల కోసమా? లేదా సవరించిన ట్వీట్ గురించి డేటాను ట్విట్టర్ యూజర్ లేదా ఫాలోవర్లకు తెలిసేందుకా? ఇంతకీ ఇలా మార్చిన ట్వీట్ అందరికి యాక్సస్ అవుతుందా? లేదా కేవలం ట్విట్టర్ యూజర్ కు మాత్రమేనా? అనేది క్లారిటీ లేదు. ట్విట్టర్ తన ఎడిట్ బటన్‌కు సంబంధించి ఎలాంటి ప్లాన్ చేస్తుందో తెలియాలంటే.. ఆ ఎడిట్ బటన్ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చినా తర్వాత మాత్రమే తెలుస్తుంది.

ఇంతకీ ఈ ఎడిట్ బటన్ ఫీచర్ ప్రీమియం లేదా ఫ్రీగా అందరి యూజర్లకు అందుబాటులోకి రానుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. Twitter ప్రస్తుతానికి ఈ కొత్త Tweet Edit Button బ్లూ టిక్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. గతంలోనే ట్విట్టర్ అధికారిక అకౌంట్లలో కొత్త ఎడిట్ బటన్‌పై పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అంతకంటే ముందు ఈ ఎడిట్ బటన్‌ అందుబాటులోకి వస్తే.. యూజర్లకు భద్రతపరమైన ఎలాంటి సమస్యలు వస్తాయి అనేదానిపై కూడా ట్విట్టర్ దృష్టిసారించనుంది.

Read Also : Elon Musk : ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ పోల్.. ఎలన్‌ మస్క్‌‌పై ట్విట్టర్‌​​​ సీఈవో కామెంట్..!