Mystery Drones Flying: భయం గుప్పిట్లో న్యూయార్క్ ప్రజలు.. ఆకాశంలో మిస్టరీ డ్రోన్లు.. అక్కడ ఏం జరుగుతుందంటే?

అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిలేనియా సహా ఈస్ట్ కోస్ట్ స్టేట్స్ లోని ప్రజలు భయంభయం గడుపుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం..

Mystery Drones Flying: భయం గుప్పిట్లో న్యూయార్క్ ప్రజలు.. ఆకాశంలో మిస్టరీ డ్రోన్లు.. అక్కడ ఏం జరుగుతుందంటే?

New York

Updated On : December 14, 2024 / 8:47 AM IST

Mystery Drones Flying Over New Jersey : అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిలేనియా సహా ఈస్ట్ కోస్ట్ స్టేట్స్ లోని ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం.. గతకొద్ది రోజులుగా రాత్రివేళల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగురుతుండటమే. ఆకాశంలో పెద్దపెద్ద డ్రోన్లు వెలుగులు విరజిమ్ముతూ సంచరిస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. వీటిపై ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వాటి గురించి సరైన సమాచారాన్ని ఫెడరల్ అధికారులు వెల్లడించలేదు. తాజా ఘటనపై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు లేఖ రాశారు. తాజా ఘటనలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు తాజా ఘటనలపై కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.. బైడెన్ ప్రభుత్వానికి తెలియకుండానే అవి ఎగురుతున్నాయా అని ప్రశ్నించారు. వాటిని కూల్చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: KTR On Allu Arjun Arrest: ఇదే లాజిక్ రేవంత్ రెడ్డికి వర్తించదా..? అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ ట్వీట్

మేరీల్యాండ్ గవర్నర్ లారీ హోగన్ తన ట్విటర్ ఖాతా ద్వారా వీడియోను పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రాత్రి దాదాపు 9.45గంటల సమయంలో మేరీల్యాండ్ లోని డేవిడ్‌సన్‌విల్లే (మన దేశ రాజధాని నుండి 25 మైళ్ళు)లో ఉన్న నా నివాసంపైన ఆకాశంలో డజన్ల కొద్దీ పెద్దపెద్ద డ్రోన్లు ఎగురుతున్నట్లు నేను వ్యక్తిగతంగా చూశాను. దాదాపు 45 నిమిషాలపాటు అవి ఆకాశంలో ఎగరడం గమనించానని తెలిపారు. ఆకాశంలో పెరుగుతున్న మిస్టరీ డ్రోన్ల సంచారం ప్రజాభద్రతకు, జాతీయ భద్రతకు ముప్పు తెస్తాయా అనే విషయం నాకు తెలీయదు. కానీ, ప్రజలు భయాందోళన చెందుతున్నారని అన్నారు. వైట్ హౌస్, మిలిటరీ, ఎఫ్‌బిఐ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి అవి ఏమిటో, అవి ఎక్కడి నుండి వచ్చాయి, వాటిని ఎవరు నియంత్రిస్తున్నారు.. వాటివల్ల ఏవైనా ముప్పు ఉంటుందా అనే విషయాన్ని తెలియజేయండి అంటూ పేర్కొన్నాడు. మరోవైపు న్యూజెర్సీ సెనేటర్ ఆండీ కిమ్ ఆకాశంలో విచిత్రమైన వస్తువులు ఎగురుతున్న వీడియోను షేర్ చేశారు.

 

ఇదిలాఉంటే.. న్యూయార్క్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో రాత్రివేళల్లో ఆకాశంలో ఎగురుతున్న మిస్టరీ డ్రోన్లపై అనేక రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఇరాన్ మదర్ షిప్ నుంచి అవి వచ్చాయంటూ వదంతులు వినిపిస్తున్నాయి. వాటిని చైనా వదిలిందని కొందరు పేర్కొంటుండగా.. ట్రంప్ విడిచిపెట్టారంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఇలా పలు రకాల పేర్లతో సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.