Napoleon Bonaparte : నెపోలియన్ టోపీ ధర ఎంతో తెలుసా..?! వేలంలో సరికొత్త రికార్డు
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే టోపీ వేలంలో సరికొత్త రికార్డు ధర సృష్టించింది. యుద్ధం ఆయన ధరించిన టోపీని తాజాగా వేలం వేయగా అత్యంత రికార్డు ధరకు అమ్ముడైంది.

Napoleon Bonaparte hat sells
Napoleon Bonaparte hat sells : 19 శతాబ్దపు ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే టోపీ వేలంలో సరికొత్త రికార్డు ధర సృష్టించింది. ఐరోపాలో యుద్ధం చేసినప్పుడు నెపోలిన్ ధరించిన టోపీని తాజాగా పారిస్ లో వేలం వేయగా అత్యంత రికార్డు ధరకు అమ్ముడై సరికొత్త రికార్డను క్రియేట్ చేసింది. ఆదివారం (నవంబర్ 19,2023) పారిస్ లో వేలం వేయగా దాదాపు రెండు మిలియన్ యూరోల( 1.932 మిలియన్ యూరో)కు అంటే భారత కరెన్సీలో రూ.17 కోట్ల ధర పలికింది. కానీ ఇంత భారీ ధరకు ఈ టోపీని సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలను వెల్లడించలేదు.
ఇదే టోపీ 2014లో 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు నెపోలియన్ సంతకం ఉంటుంది. ఫ్రెంచ్ పాలకుడి వద్ద మిగిలి ఉన్న 20 టోపీల్లో ఈ టోపీ కూడా ఒకటి. ఈ టోపీ ఇప్పటి వరకు 2022లో మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ ఆధ్వర్యంలో ఉండేది. నోయిసీజ్ నెపోలియన్ కు సంబంధిచన జ్ఞాపకాలను సేకరించేవారు. అతని వద్ద నెపోలియన్ కు సంబంధించిన పలు జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి.
యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష .. బాధితురాలి అప్పీల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలన కాలంలో 120 టోపీలను ధరించారని చరిత్ర చెబుతోంది. ఆయన అన్ని టోపీలు ధరించినా తాజాగా వేలంలో అత్యంత ధరకు అమ్ముడైన ఈ టోపీ మాత్రం చాలా ప్రత్యేకమైనది అని వేలం నిర్వాహకులు తెలిపారు. నెపోలియన్ చక్రవర్తి తన పదవీ కాలంలో ప్రత్యేకమైన టోపీలను ధరించేవారు. ఆయన టోపీలన్నీ చాలా ప్రత్యేకంగా ఉండేవి. అలా ఆయన టోపీలతో ప్రత్యేకంగా నిలిచేవారు. పైగా ఆయన టోపీని ధరించే విధానంలో కూడా ప్రత్యేకంగా ఉండేవారు. అందరిలా కాకుండా ఓ పక్కకు టోపీని ధరించేవారు. ఆ స్టైలే అతనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
నెపోలియన్ చక్రవర్తి అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఆయన టోపీయే. అతను ధరించే టోపీలు..ధరించే తీరుతో ఆయన ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండేవారు. అతను టోపీని ధరించే స్టైల్ ను ప్రెంచ్ లో ‘ఎన్ బటైల్’ అని పిలిచేవారట. ఈ టోపీల కారణంగానే యుద్ధం జరిగే సమయంలో అతని మిలటరీ దళాలు అతనిని ఈజీగా గుర్తించేవట. అందరు తమ టోపీలను ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగిన వ్యక్తి చరిత్రలో నిలిచిపోయారు.
1815లో వాటర్ లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయిన తరువాత అతని క్యారేజ్ నుంచి దొంగిలించబడి వాటిలో వెండి ప్లేట్, కత్తెరలు, రేజర్ లు, ఓ చెక్క వ్యానిటీ కేససు తో పాటు వెండ్ టూత్ బ్రష్ వంటి పలు వస్తువులు కూడా వేలంలో ఉన్నాయి.