Butch Wilmore and Sunita Williams
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ-10 మిషన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది.
Also Read: Sunita Williams: అంత ఈజీ కాదు.. భూమి మీదకు వస్తున్న సునీతా విలియమ్స్ ఈ సమస్యలతో బాధపడవచ్చు..
బుధవారం తెల్లవారు జామున..
క్రూ-10 మిషన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీత, బుచ్ విల్మోర్ లు ఘనస్వాగతం పలికారు. అయితే, సునీత విలియమ్స్, విల్మోర్ లు భూమిపైకి రానున్నారు. ఈ విషయంపై నాసా తాజాగా కీలక ప్రకటన చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3.27గంటలకు) ప్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.
ప్రక్రియ ఇలా..
క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.45 గంటలకు మొదలవుతుంది. సోమవారం అర్థరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక్ అన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తరువాత మంగళవారం సాయంత్రం 4.45గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకొని కిందికు వస్తుంది. సాయంత్రం మంగళవారం 5.57 గంటలకు ప్లోరిడా తీరానికి చేరువలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది.
Also Read: Sunita Williams salary: సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేస్తున్నారు.. ఆమె జీతం ఎంతో తెలుసా?
ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించనున్న నాసా..
మార్చి 17 (సోమవారం) రాత్రి 10.45 గంటలకు (భారత కాలమానం ప్రకారం మార్చి 18న ఉదయం 8.30గంటల ప్రాంతంలో) క్రూ డ్రాగన్ వ్యోమనౌక హాచ్ మూసివేత ప్రక్రియ సమయం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి రావడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
.@NASA will provide live coverage of Crew-9’s return to Earth from the @Space_Station, beginning with @SpaceX Dragon hatch closure preparations at 10:45pm ET Monday, March 17.
Splashdown is slated for approximately 5:57pm Tuesday, March 18: https://t.co/yABLg20tKX pic.twitter.com/alujSplsHm
— NASA Commercial Crew (@Commercial_Crew) March 16, 2025