Sunita William: ఐఎస్ఎస్‌కు చేరుకున్న‌ క్రూ-10.. సంతోషంతో డ్యాన్స్ చేసిన సునీత విలియమ్స్.. వారు భూమిపైకి వచ్చేది ఎప్పుడంటే?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోనే తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ..

Sunita William: ఐఎస్ఎస్‌కు చేరుకున్న‌ క్రూ-10.. సంతోషంతో డ్యాన్స్ చేసిన సునీత విలియమ్స్.. వారు భూమిపైకి వచ్చేది ఎప్పుడంటే?

Sunita William

Updated On : March 18, 2025 / 6:38 PM IST

Sunita William SpaceX Crew 10: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోనే తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపైకి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ ఆదివారం ఉదయం 9.37 గంటల సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో విజయవంతంగా అనుసంధానమైంది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది.

Also Read: Sunita Williams salary: సునీతా విలియమ్స్‌ భూమి మీదకు వచ్చేస్తున్నారు.. ఆమె జీతం ఎంతో తెలుసా?

భారత కాలమానం ప్రకారం 15వ తేదీ తెల్లవారు జామున 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ-10 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ -9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో వ్యోమగాములు అమెరికాకు చెందిన ఆన్ మెక్ క్లెయిన్, నిలోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఇవాళ ఉదయం ఐఎస్ఎస్ తో క్రూ-10 మిషన్ విజయవంతంగా అనుసంధానమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది.

 

 

ఐఎస్ఎస్ చేరుకున్న నలుగురు వ్యోమగాములకు సునీతా విలియమ్స్, విల్ మోర్ తోపాటు అందులో ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. వారు తమ తోటి వ్యోమగాములను కౌగిలించుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగాములు నిక్ హేగ్, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ల నుంచి క్రూ-10 బృందం బాధ్యతలు స్వీకరించనుంది. ఈనెల 19వ తేదీన సునీత విలియమ్స్, విల్మోర్ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ద్వారా భూమికి బయలుదేరుతారని భావిస్తున్నారు.

Also Read: Aliens: భూమిపై ఏలియన్స్..! 1940 నుంచి అంతరిక్షనౌక వచ్చి వెళ్తోంది.. సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు

వాతావరణం అనుకూలిస్తే బుధవారం నాటికి స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి ప్లోరిడా తీరంలో దిగుతుందని నాసా తెలిపింది. అయితే, మార్చి 19న లేదా అంతకంటే ముందే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు భూమిపైకి తిరిగి వస్తారని భావిస్తున్నారు. వారు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.