బుధ గ్రహంపై బంగారంతో ఆక్సిజన్ తయారుచేయనున్న నాసా

నాసా ఈ ఏడాది సైన్స్ ఫిక్షన్ క్రియేట్ చేయనుంది. చాలా ప్రయత్నాల తర్వాత సొంత వెర్షన్లో మార్టియన్ ఆక్సిజనరేటర్ ను సిద్ధం చేస్తుంది. బుధగ్రహంపై ఆక్సిజన్ తయారుచేసేందుకు గోల్టెన్ బాక్స్ వాడనుంది. ఈ ప్రక్రియను మార్స్ ఆక్సిజన్ ఐఎస్ఆర్యూ ప్రయోగం అంటారు. నాసా మార్స్ 2020 మిషన్లో భాగంగా ఈ ప్రయోగం చేయనున్నారు. 

జులై 17న దీనిని ప్రారంభిస్తే 2021 ఫిబ్రవరి 18నాటికి బుధ గ్రహానికి చేరుకుంటుంది. దీనికి సంబంధించిన రోవర్ ను జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ తయారుచేస్తుంది. దీని లక్ష్యం మార్స్ మీద ఉన్న రాళ్ల చరిత్ర తెలుసుకోవడమే. ప్రయోగం మొత్తంలో అక్కడ ఉన్న మట్టి, రాయి నమూనాలను సేకరిస్తుంది. వాటి వివరాల సాయంతో భవిష్యత్‌లో భూమి నుంచి మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 

ప్రయోగంలో మరో కోణమేమిటంటే కార్బన్ డై ఆక్సైడ్ ను గోల్డెన్ బాక్స్ ఉపయోగించి ఆక్సిజన్ తయారుచేస్తారు. బుధ గ్రహంపై వాతావరణంలో 95శాతం కార్బన్ డై ఆక్సైడ్, 2శాతం నైట్రోజన్, 2శాతం ఆర్గాన్ ఉంటాయి. ఈ ప్రయోగ ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ ను వేరు చేస్తారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే బుధ గ్రహంపై మానవ మనుగడ సాధ్యమవుతుంది. 

మనుషులను మార్స్ కు పంపిస్తే మళ్లీ వారిని క్షేమంగా తీసుకురావాలనుకుంటున్నాం. వారంతా అక్కడకు వెళ్లడానికి రాకెట్ సాయం తీసుకోవాల్సిందే. లిక్విడ్ ఆక్సిజన్ ను మాతో పాటు తీసుకెళ్తాం. ఇంకో ఆలోచన ఏంటంటే ఖాళీ ట్యాంకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఆక్సిజన్ నింపుకు రావాలనుకుంటున్నాం’ అని మాక్సి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ హెచ్ అన్నారు. 

గతేడాది కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన టీం కార్బన్ డై ఆక్సైడ్ రియాక్షన్స్ తో మాలిక్యులర్ ఆక్సిజన్ కనుగొన్నారు. రీసెర్చ్ టీం కార్బన్ డై ఆక్సైడ్ ను పొడి చేసి విజయవంతంగా ప్రయోగాన్ని పూర్తి చేసింది. 

Also Read | కరోనా ఎప్పుడు అంతం అవుతుందో చెప్పిన..బాల జ్యోతిష్కుడు