Nawaz Sharif : వచ్చే నెలలో పాక్ తిరిగి రానున్న నవాజ్ షరీఫ్
పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ వచ్చే నెలలో తిరిగి స్వదేశానికి వస్తారని ప్రస్థుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలన్న యోచనలపై కోర్టు నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు....

Nawaz Sharif To Return To Pak
Nawaz Sharif : పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ వచ్చే నెలలో తిరిగి స్వదేశానికి వస్తారని ప్రస్థుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలన్న యోచనలపై కోర్టు నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. (Nawaz Sharif To Return To Pakistan) సెప్టెంబరులో తన సోదరుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ తిరిగి వచ్చి పార్టీకి నాయకత్వం వహిస్తారని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.
IMD Issues Red Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు..రెడ్ అలర్ట్ జారీ
నవాజ్ షరీఫ్ ఐదేళ్ల అనర్హత కాలాన్ని పూర్తి చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఫీల్డ్‌లో ఉన్న చట్టం ప్రకారం అనర్హతకు గరిష్టంగా ఐదేళ్లు గడువు ఉందని, నవాజ్ షరీఫ్ తిరిగి వస్తారని ఆయన వెల్లడించారు. దేశం సార్వత్రిక ఎన్నికల వైపు వెళుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
MiG-29 fighter jets : శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద మిగ్-29 ఫైటర్ జెట్ మోహరింపు
షెహబాజ్ షరీఫ్ ఆపద్ధర్మ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన అన్న నవాజ్ షరీఫ్‌ను కలవడానికి లండన్‌కు వెళతానని చెప్పారు. వచ్చే నెలలో నవాజ్ షరీఫ్ తిరిగి పాకిస్థాన్‌కు వస్తారని, చట్టాన్ని ఎదుర్కొని ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. (Lead Party In Polls) అయితే నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి వచ్చే తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు.