Nepal Floods : నేపాల్ వరదల్లో వైరల్‌గా మారిన ఇల్లు.. ఆ లక్కీ హౌస్ అసలు కథ ఇదే.. ఆర్ఆర్సీ ఫ్రేమ్ వల్లేనా?
Nepal Flash Floods Viral House : నేపాల్‌లో వరద విధ్వంసాన్ని తట్టుకొని ఓ ఇల్లు చెక్కచెదరకుండా ఉంది. అందులో ఉన్నవారంతా ప్రాణాలతో సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ ఇల్లు వరదలను తట్టుకొని బలంగా ఉండటానికి కారణం ఏమిటి అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
Nepal Flash Floods Viral House
Nepal Flash Floods Viral House : హిమాలయ ప్రాంతంలో ఓ హిమానీనదం సమీపంలోని కొండచరియలు భారీగా కూలిపోవడంతో నేపాల్‌లో జలప్రళయం సృష్టించింది. భారీగా కూలిన రాళ్లు, కరిగిన మంచు నీరు దిగువ ప్రాంతాల్లోని నదుల్లోకి చేరడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఆగస్టు 26వ తేదీన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించగా.. ఇప్పటి వరకు 900మందికిపైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 3వేల మందికిపైగా ఆచూకీ ఇంకా దొరకలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ వరదలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. భారీ విపత్తును తట్టుకొని ఓ ఇల్లు కూలకుండా ఉంది. అందులో నివాసం ఉండేవారుసైతం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో సోషల్ మీడియాలో ఆ లక్కీ హౌస్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
Also Read : Nepal Flash Floods Death Count : నేపాల్ మెరుపు వరదల్లో 900 దాటిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు హిమాలయ లోయల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా వచ్చిన నీరు, బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు ఇళ్లు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. అయితే ఈ విధ్వంసం మధ్య ఓ ఆకుపచ్చ రంగు ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరద నీరు ఇంటిని దాదాపు చుట్టుముట్టినా.. నిర్మాణం కూలిపోలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అయితే, ఆ ఇల్లు స్ట్రాంగ్ గా నిలబడి వారిని ప్రాణాలను కాపాడింది.
ఇంతటి భారీ విపత్తును కూడా తట్టుకొని ఆ ఇల్లు కదలకుండా ఉండటానికి కారణం ఏమిటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిర్మాణ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ ఇంటికి రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) ఫ్రేమ్, స్టీల్ రాడ్లతో అనుసంధానించిన పిల్లర్లు, బీములు, బలమైన పునాది ఉన్నాయి. దీంతో వరద నీరు, బురద, రాళ్లు ఢీకొట్టినప్పుడు ఏర్పడిన ఒత్తిడిని నిర్మాణం కొంతవరకు తట్టుకోగలిగింది. అయితే ఇంటి నిర్మాణమే దాన్ని కాపాడిన ఏకైక కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన వరద ప్రవాహ మార్గానికి కాస్త పక్కన, కొంత ఎత్తైన ప్రదేశంలో ఇల్లు ఉండటం కూడా కలిసొచ్చింది. ఇంటి కాంపాక్ట్ ఆకారం కారణంగా వరద ప్రవాహం ఇరువైపులా విడిపోయి వెళ్లింది. పక్కనే ఉన్న ఇళ్లపైకి నేరుగా వరద, బండరాళ్లు, మట్టి పెళ్లలు దూసుకొచ్చి ఢీకొట్టాయి. ఈ ఇల్లు ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి కొద్దిగా పక్కన, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా ఇరువైపులా విడిపోయి వెళ్లింది.
వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల దెబ్బ, పునాది బలం, నిర్మాణ నాణ్యత, ఇంటి స్థానం వంటి అనేక అంశాలు కలిసి ఈ గ్రీన్‌హౌస్‌ను చెక్కు చెదరకుండా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాఅని ఇలాంటి నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు భారీ వరదలను తట్టుకుంటుందని చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఇల్లు వైరల్ కావడంతో ఇంటిని ఇంత బలంగా కట్టిన ఇంజినీర్ ఎవరు?, ఏ సిమెంట్ వాడారు’ అనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు. అంతేకాదు.. బిహార్‌లో చిన్నపాటి వరదలకు కూడా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఈ మధ్య వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వేలు కూడా కొట్టుకుపోతుండడంతో .. ఆ ఇంజినీర్ సాబ్‌ను ఇక్కడికి రప్పించాలనే చర్చ సోషల్ మీడియాలో సరదాగా నడిచింది.
Good News,
Dear citizens of world,All those were praying and worried about what happened to people in the Green House during the catastrophic Nepal Floods
The family and house survived the ordeal. pic.twitter.com/iElo4qXvBL
— Woke Eminent (@WokePandemic) August 28, 2026
