పబ్‌జీ.. పబ్‌జీ.. పబ్‌జీ..వీడియో గేమ్స్ అలవాటు ఉండేవారికి పరిచయం అక్కరలేని గేమ్.
PUBG.. చావటమో, చంపటమో వరకు వెళుతుంది. ఇది కేవలం ఆట అన్న సంగతి మర్చిపోయి మరీ బానిస అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్ గేమ్ వల్ల బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలోనే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. ఓ దేశం మాత్రం గేమ్ నే నిషేధించింది. అదే నేపాల్. ఆ దేశంలో PUBG ఆడితే దేశద్రోహం. ఎందుకంటే నిషేధించారు కాబట్టి.
Read Also : మొబైల్, వెబ్ వెర్షన్ : ‘Jio News’ యాప్ వచ్చేసింది
నేపాల్ లో PUBG గేమ్ బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్న వెంటనే అమల్లోకి తెచ్చేసింది అక్కడి ప్రభుత్వం. 2019, ఏప్రిల్ 11వ తేదీ నుంచే నిషేధం అమల్లోకి వచ్చిందని.. ఎవరైనా గేమ్ ఆడుతూ పట్టుబడినా జైలు శిక్ష అనుభవించక తప్పదని వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం. పిల్లలపై ఈ గేమ్ చెడు ప్రభావాన్ని చూపిస్తున్నందునే నిషేధించినట్లు నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (ఎన్‌టీఏ) డిప్యూటీ డైరెక్టర్ సందీప్ ప్రకటించారు.
ఈ క్రమంలో నేపాల్ కు చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ తో నేపాల్‌లోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, మొబైల్ ఆపరేటర్లు, నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లకు పబ్‌జి గేమ్ స్ట్రీమింగ్‌ను బ్లాక్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్లు అనధికారికంగా యాక్సెస్ ఇస్తే మాత్రం వారి లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది నేపాల్ గవర్నమెంట్.
Read Also : భారీ కుంభకోణం : 20 బ్యాంకుల నుంచి రూ.2వేల 500 కోట్లు దోచేశారు