కూలిపోయిన హెలికాప్టర్ : ఆరుగురు మృతి

నేపాల్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నేపాల్ విమానయాన శాఖ, పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర

  • Publish Date - February 27, 2019 / 09:43 AM IST

నేపాల్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నేపాల్ విమానయాన శాఖ, పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర

నేపాల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నేపాల్ విమానయాన శాఖ, పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర ప్రసాద్ అధికారి ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. నేపాల్ కొండల ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. తప్లేజంగ్ ప్రాంతంలోని పతిబరాలో హెలికాప్టర్ క్రాష్ అయినట్టు గుర్తించారు.