Vaccination Cards : నేపాల్ సంచలన నిర్ణయం..అది ఉంటేనే బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి కోసం 'వ్యాక్సినేషన్ కార్డ్‌లను'

Vaccination Cards : నేపాల్ సంచలన నిర్ణయం..అది ఉంటేనే బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి

Nepal12

Vaccination Cards :  ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే వ్యాక్సినేషన్ కార్డ్‌లను( రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి  ఇవ్వబడేది) తప్పనిసరి చేస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి-17 నుంచి బహిరంగ ప్రదేశాల్లో(ఆఫీసులు,హోటల్స్,సినిమా థియేటర్లు,పార్కులు వంటివి)కి రావాలంటే ఈ వ్యాక్సినేషన్ కార్డ్‌లు తప్పనిసరి అని నేపాల్ లోని కోవిడ్ మేనేజ్ మెంట్ సెంటర్ ప్రతినిధి సునితా నేపాల్ తెలిపారు.

ఇక,నేపాల్‌లో గత 24 గంటల్లో 841 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 832,589కి చేరుకుంది. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 11,604కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,755గా ఉంది. నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇప్పటివరకు 814,230 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు.

మరవైపు, భారత్ లో కోవిడ్ నేపథ్యంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం..జనవరి10 నుంచి మొదలయ్యే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో నేపాల్ ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈ సదస్సును గుజరాత్ ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో నేపాల్ ప్రధాని భారత పర్యటన వాయిదాపడింది.

ALSO READ Covid-19 : మహారాష్ట్రలో పెరుగుతోన్న కరోనా మరణాలు..భారీగా కేసులు