ఒక్క వీడియోను 28,763 సార్లు చూసిన నెటిజ‌న్

యూట్యూబ్‌లో ఏదైనా వీడియో బాగా న‌చ్చితే వంద సార్లు చూస్తాం. కానీ ఓ నెటిజ‌న్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ తెరకెక్కిస్తున్న బ్లాక్‌ విడో సినిమా టీజర్‌ను 28,763 సార్లు వీక్షించాడ‌ట‌.

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 03:02 AM IST
ఒక్క వీడియోను 28,763 సార్లు చూసిన నెటిజ‌న్

Updated On : January 14, 2020 / 3:02 AM IST

యూట్యూబ్‌లో ఏదైనా వీడియో బాగా న‌చ్చితే వంద సార్లు చూస్తాం. కానీ ఓ నెటిజ‌న్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ తెరకెక్కిస్తున్న బ్లాక్‌ విడో సినిమా టీజర్‌ను 28,763 సార్లు వీక్షించాడ‌ట‌.

యూట్యూబ్‌లో ఏదైనా వీడియో బాగా న‌చ్చితే వంద సార్లు చూస్తాం. ఇంకా బాగా నచ్చితే 500 సార్లు చూస్తాం. కానీ ఓ నెటిజ‌న్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ తెరకెక్కిస్తున్న బ్లాక్‌ విడో సినిమా టీజర్‌ను 28,763 సార్లు వీక్షించాడ‌ట‌. అయితే మ‌రోసారి చూడాల‌ని భావించిన నెటిజ‌న్‌కి నిరాశ ఎదురైంది. 

ఇప్ప‌టికే మీరు 28,763 సార్లు ఈ వీడియోను చూసినందున.. మరోసారి దానిని ప్రదర్శించలేకపోతున్నామని యూ ట్యూబ్ నెటిజ‌న్‌ కు హెచ్చ‌రిక జారీ చేసింది. దీంతో చేసేదేం లేక నెటిజ‌న్ మ‌ళ్ళీ ఆ వీడియో చూసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అయితే ఈ విష‌యాన్ని మార్వెల్ త‌న ఫేస్ బుక్‌లో స్క్రీన్ షాట్ తీసి పెట్ట‌డం విశేషం.