Global Covid Deaths : ప్రపంచంలో రెట్టింపు స్థాయిలో కొవిడ్ మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాలు రెట్టింపు స్థాయిలో పెరిగాయని ఓ కొత్త విశ్లేషణ వెల్లడించింది. ప్రపంచంలో కరోనాతో మరణించినవారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

Global Covid Deaths : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాలు రెట్టింపు స్థాయిలో పెరిగాయని ఓ కొత్త విశ్లేషణ వెల్లడించింది. ప్రపంచంలో కరోనాతో మరణించినవారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే రెట్టింపు స్థాయిలో పెరిగాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి అమెరికాలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కరోనాతో 905,000 మంది మరణించినట్టు విశ్లేషణ అంచనా.

ప్రస్తుత కరోనా మరణాల్లో కంటే 38శాతం అత్యధికంగా ఉందని 561,594 లక్షల మరణాలు ఉండొచ్చునని సెంటర్స్ ఫర్ డీసిజ్ కంట్రోల్ అండ్ ప్రెవిన్షన్ అంచనా వేస్తోంది. 1918లో ఫ్లూ విజృంభణ సమయంలో అమెరికా మరణాల సంఖ్యను కరోనా మరణాల సంఖ్య అంచనా అధిగమించినట్టు పేర్కొంది. అంటే.. దాదాపు 6లక్షల 75వేల మంది కరోనామంది మరణించినట్టు అంచనా.

వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు ప్రపంచ కరోనా మరణాలపై కొత్త విశ్లేషణను నిర్వహించారు. స్పానిష్ ఫ్లూ ప్రపంచ మరణాల రేటు దాటలేదు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా మరణాలపై అంచనా ప్రకారం.. కోవిడ్ లెక్కల పరంగా ప్రపంచ స్థాయిలో స్పానిష్ ఫ్లూకు మించి కరోనా మరణాలు పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రపంచ దేశాల్లో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు