న్యూ ఫోన్స్ ఫెస్టివల్ : 25 నుంచి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్

బార్సిలోనా : కొత్త ఫోన్ల సందడి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 25న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)2019 ఫెస్టివల్ మొదలు కానుంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 25 నుంచి నాలుగురోజుల పాటు..ఫిబ్రవరి 28 వరకు కార్యక్రమం జరుగనుంది. దీంట్లో భాగంగా పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ కొత్త ఫోన్లను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో మెయిన్ గా ఎల్‌జీ (లైఫ్స్ గుడ్) కంపెనీ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం అయిన సోనీ నుంచి ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ‘ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్ 4’తోపాటు పలు కొత్త మోడల్స్‌ను లాంచ్ చేయనున్నారు.
ఎండబ్ల్యూసీ కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..
- ఎల్‌జీ జీ8
- వి50
- హువావే ఫోల్డబుల్ ఫోన్
- హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 9 ప్యూర్ వ్యూను 8.1 ప్లస్
- సోనీ ఎక్స్‌పీరియా 1, 10, 10 ప్లస్ , ఎల్3
- షియోమీ ఎంఐ9
- ఎంఐ మిక్స్ 5జి
- వన్‌ప్లస్ 5జీ
- లెనోవో జడ్6 ప్రొ
- జడ్5 ప్రొ
- జడ్‌టీఈ నూబియా
- మోటోరోలా రేజర్ ఫోల్డబుల్ ఫోన్
- అసుస్ జెన్‌ఫోన్ 6 సిరీస్ ఫోన్లు
- హెచ్‌టీసీ ఎక్సోడస్ తదితర ఫోన్లను ప్రదర్శించనున్నారు.