న్యూ ఇయర్ జోష్ : టికెట్ లేకుంటే తోలు తీస్తాం.. పోలీసుల వార్నింగ్!

కొద్ది గంటల్లో 2020 కొత్త ఏడాది రాబోతోంది. 2019 సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకులకు సంబంధించి భారీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీసులు ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు. లండన్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేవారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేకించి రివర్ థేమ్స్ పై సెలబ్రేషన్స్ జరుపుకునే వారికి హెచ్చరికలు జారీ చేశారు. టికెట్ లేకుండా ఎవరూ కూడా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనరాదని హెచ్చరిస్తున్నారు. మంగళవారం (డిసెంబర్ 31, 2019) రాత్రి రివర్ థేమ్స్‌పై న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ పేల్చేందుకు ఇప్పటివరకూ లక్షకు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. టికెట్లు లేకుండా ఎవరూ ఇంట్లో నుంచి వీక్షించరాదని, నగరంలోని ఇతర ఈవెంట్లకు వెళ్లరాదని మెట్రోపాలిటన్ పోలీసులు సూచిస్తున్నారు. యూకేలోని ప్రధాన నగరాలైన మాంచెస్టర్, కార్డిఫ్, న్యూ కాస్టలే, ఇన్వేర్నెస్, నాటింగ్ హామ్ లో భారీ ఫైర్ వర్క్స్ ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారు.
మరోవైపు ఎడిన్ బర్గ్ లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమైపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వేలాది మంది ప్రీ-హాగ్ మనాయ్ టార్జ్ లైట్ తో ఊరేగింపుగా వీధుల్లో తిరుగుతూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. రివర్ థేమ్స్ పై ఫైర్ వర్క్స్ పేల్చేవారి విషయంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ‘ రివర్ ఈవెంట్ సందర్శకుల్లో ఎవరైనా టికెట్ లేకుండా వస్తే వారికి అనుమతి ఉండదు. టికెట్లు లేనివారంతా తమ ఇంట్లోనే ఉండి ఫైర్ వర్క్స్ వీక్షించాలి’ అని లండన్ పోలీసులు తెలిపారు. లండన్ నగరంలో మంగళవారం రాత్రి 12వేల ఫైర్ వర్క్స్ కాంతుల్లో ఆకాశం ప్రకాశంతంగా వెలిగిపోనుంది. లండన్ ఐ నుంచి దాదాపు 2వేల ఫైర్ వర్క్స్ ప్రదర్శించనున్నారు.
యూకేలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం సాయంత్రం చల్లగా మారేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం వేడిగా ఉండనుంది. స్కాట్లాండ్ సహా ఇతర నార్తరన్ ఇంగ్లండ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 1 C (38.8F) లేదా 2C (35.6F) నమోదైనట్టు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. యూకేలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం 5C (41F) ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. ఈశాన్య ఇంగ్లండ్ సహా పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాతావరణ శాఖ ఎల్లో వెదర్ వార్నింగ్ జారీ చేసింది. ఈ హెచ్చరిక.. న్యూ ఇయర్ వేడుకలకు ముందు రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం..) 7గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 3గంటల వరకు అమల్లో ఉండనుంది.