70 ఏళ్ల నాటి కేసులో పాక్‌కు షాక్ : నిజాం ఆస్తులు భారత్‌కే
70 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఏడో నిజాం ఆస్తులపై భారత ప్రభుత్వంతో పాటు..ఆయన వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ్‌కంజాకే హక్కులు ఉన్నాయంటూ హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.

70 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఏడో నిజాం ఆస్తులపై భారత ప్రభుత్వంతో పాటు..ఆయన వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ్‌కంజాకే హక్కులు ఉన్నాయంటూ హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
70 ఏళ్ల నుంచి నలుగుతున్న కేసులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఏడో నిజాం ఆస్తులపై భారత ప్రభుత్వంతో పాటు..ఆయన వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ్‌కంజాకే హక్కులు ఉన్నాయంటూ హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అలానే ఈ ఆస్తులపై తనకే హక్కుందంటూ వాదించిన పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చింది. దీంతో భారత్‌కి పెద్ద విజయం దక్కినట్లైంది.
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్తుల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ దశాబ్దాల తరబడి నానుతూ వచ్చింది.. ఇప్పుడు తీర్పు భారత్‌కి అనుకూలంగా రావడంతో హర్షం వ్యక్తం అవుతోంది. 1948లో అంటే అప్పటికి దేశానికి స్వతంత్రం వచ్చి ఏడాదైంది. అయితే హైదరాబాద్ సంస్థానం ఇంకా ఇండియాలో విలీనం కాలేదు. ఇండియాలో చేరాలా లేక పాకిస్థాన్ తో కలవాలా, స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలా అనే డైలమాలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నారు. ఈ సమయంలో అంటే 1948లో మీర్ ఉస్మాన్ అలీన్ ఖాన్ బ్రిటన్ లోని పాకిస్థాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీంతులా బ్యాంక్ అక్కౌంట్ కు పది లక్షల పౌండ్లు ట్రాన్స్ ఫర్ చేశారు. పంపిన సొమ్మును భద్రం చేయాలని హబీబ్ ఇబ్రహీం ను కోరారు. ఆ తర్వాత దేశంలో అనేక మార్పులు సంభవించాయి.
హైదరాబాద్ సంస్థానం, ఇండియాలో విలీనం అయింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక్కడే ఉండిపోయారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పంపిన అమౌంట్ అప్పటి నుంచి వడ్డీ సహా 35 మిలియన్ పౌండ్లకు అంటే 307 కోట్ల రూపాయలకు చేరింది. ఈ సొమ్ము దగ్గరే వచ్చింది అసలు పేచీ.
ఈ డబ్బు తమకే చెందుతుందని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసులు ప్రిన్స్ ముకరంజా, ఆయన సోదరుడు ముఫ్ కంజా వాదించారు. .లండన్ బ్యాంకులో ఉన్న సొమ్మును 1963 ఏప్రిల్ లో ఒక ట్రస్ట్ ద్వారా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కానుకగా ఇచ్చారన్నది ప్రిన్స్ ముకరంజా, ఆయన సోదరుడు ముఫ్ కంజా వాదన. దీంతో నిజాం సొమ్ముకు తామే అసలైన వారసులమని కోర్టులకు చెప్పారు. ఏడో నిజాం వారసుల వాదనకు ఇండియా మద్దతు పలికింది. అయితే ప్రిన్స్ ముకరంజా, ముఫ్ కంజా వాదనలను పాకిస్థాన్ తోసి పుచ్చుతోంది. లండన్ లోని నాట్ వెస్ట్ బ్యాంకులో భద్రంగా ఉన్న నిజాం సొమ్ము పై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని అడ్డగోలుగా వాదించింది
ఐతే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1965లో లండన్ బ్యాంకులో దాచిన సొమ్మును ఇండియాకు అసైన్ చేస్తూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది కన్వీనెంట్‌గా పక్కనబెట్టి..పాకిస్తాన్ లండన్ బ్యాంకులో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జమ చేసిన సొమ్ముపై తమకే హక్కు ఉందని చెప్పుకొచ్చింది.. ఆపరేషన్ పోలో లో భాగంగా అప్పటి హైదరాబాద్ సంస్థానంలోకి ఇండియన్ మిలటరీ ప్రవేశించినప్పుడు నిజాం కు అండగా నిలిచింది తామేనని పాకిస్తాన్ వాదించింది.
అప్పట్లో నిజాంకు తాము ఆయుధాలు సరఫరా చేశామని తెలిపింది. దీనికి బదులుగానే అప్పట్లో పాక్ హై కమిషనర్ బ్యాంక్ అకౌంట్ కు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన బ్యాంకు ఖాతా నుంచి 10 లక్షల పౌండ్లు బదిలీ చేశారని చెప్పుకొచ్చింది. జస్టిస్ మార్కస్ స్మిత్ ఈ కేసుపై లేటెస్ట్ గా రెండు వారాల పాటు విచారణ జరిపారు. ఈ విచారణలో రెండు పక్షాలు తమ వాదనలకు మద్దతుగా కోర్టుకు ఆధారాలు సమర్పించాయి. ఐతే చివరికి కోర్టు తీర్పు భారత్‌కి..నిజాం వారసులకి అనుకూలంగా వచ్చింది