North Korea: ఐదేళ్లలో ఎన్నడూ లేనంత భారీగా అమెరికా, ద.కొరియా సైనిక విన్యాసాలు

ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు మరింత పెరిగిపోవడంతో ఐదేళ్లలో ఎన్నడూ లేనంత భారీగా ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి అమెరికా, దక్షిణ కొరియా. ఇటువంటి సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన వేళ ఆ దేశ వ్యాఖ్యలను బేఖాతరు చేస్తూ అమెరికా, దక్షిణ కొరియా మళ్లీ విన్యాసాలు చేపట్టడం గమనార్హం.

North Korea: ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు మరింత పెరిగిపోవడంతో ఐదేళ్లలో ఎన్నడూ లేనంత భారీగా ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి అమెరికా, దక్షిణ కొరియా. ఇటువంటి సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన వేళ ఆ దేశ వ్యాఖ్యలను బేఖాతరు చేస్తూ అమెరికా, దక్షిణ కొరియా మళ్లీ విన్యాసాలు చేపట్టడం గమనార్హం.

నిషేధిత ఆయుధ పరీక్షలు చేస్తున్న ఉత్తర కొరియా నుంచి ముప్పు పెరగడంతో అమెరికా, దక్షిణ కొరియా ఈ విన్యాసాలు చేపట్టాయి. జలాంతర్గామి నుంచి ఇటీవలే ఉత్తర కొరియా రెండు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది. అంతకుముందు హ్వాసాంగ్-15 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించింది.

ఉత్తర కొరియా చర్యలతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమై కొన్ని రోజుల క్రితం కూడా సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఇందులో దక్షిణ కొరియా ఎఫ్-35ఏ, ఎఫ్-15కే యుద్ధ విమానాలు, అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాలు, బీ-1బీ బాంబర్లు పాల్గొన్నాయి. ఇరు దేశాలు శక్తిసామర్థ్యాలను, యుద్ధ సంసిద్ధతను చూపేందుకే విన్యాసాలు చేస్తున్నాయి. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తాము ఉపేక్షించబోమని దక్షిణ కొరియా ఇప్పటికే ప్రకటించింది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలూ చేపట్టనుందని అమెరికా నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి.

Oscars95 Live updates : 95వ ఆస్కార్ వేడుకలు.. లైవ్ అప్డేట్స్..

ట్రెండింగ్ వార్తలు