భారత్ పై ఉత్తర కొరియా సెటైర్లు..వ్యాక్సిన్లు అంతిమ పరిష్కారం కాదు

కరోనా వైరస్ పై సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా తమదేశ ప్రజలను హెచ్చరించింది.

North Korea Warns People To Brace For Virus Struggle

North Korea కరోనా వైరస్ పై సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా తమదేశ ప్రజలను హెచ్చరించింది. ఇది ఎప్పటి వరకు కొనసాగించాల్సి వస్తుందో తెలియదని పేర్కొంది. ఉత్తర కొరియాకు కరోనా వ్యాక్సిన్లు ఎప్పుడు, ఎలా అందుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఆ దేశ అధికారిక వర్కర్స్ పార్టీ అధికారిక వార్తా పత్రిక “రొడోంగ్ సిన్మన్”​లో ఈ మేరకు కథనం ప్రచురితమైంది.

ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆ కథనంలో పేర్కొంది. వ్యాక్సిన్లు ఎప్పుడూ​ అంతిమ పరిష్కారం ​అంతిమ పరిష్కారం తెలిపింది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని మరియు కొన్ని వ్యాక్సిన్ల భద్రతపై ఆందోళనలు తలెత్తుతున్నట్లు రిపోర్టులు వస్తున్న విషయాన్ని ఆ కథనంలో పేర్కొంది.

కొవాక్స్ కార్యక్రమం ద్వారా ఉత్తర కొరియాకు ఈ ఏడాది ద్వితీయార్థంలో 1.9 మిలియన్ల వ్యాక్సిన్లు అందుతాయని ఐరాస ఫిబ్రవరిలో ప్రకటించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరగడం, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ భారత్​లో అవసరాల మేరకే సరఫరా చేస్తుండటం వల్ల టీకాల కొరత ఏర్పడిందని తెలిపింది. రొడోంగ్ సిన్మన్​ లో ప్రచురించిన కథనంలో భారత్ పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేసింది ఉత్తర కొరియా ప్రభుత్వం. కరోనా వైరస్​పై గెలిచామని భావించి విదేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసి, ఆంక్షల్ని సడలించిన ఓ దేశంలో ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది ఉత్తరకొరియా ప్రభుత్వం.