కిమ్‌కు ఏ డోకా లేదు: సియోల్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బతికే బాగానే ఉన్నారని సౌత్ ప్రెసిడెంట్ మూన్ జే టాప్ సెక్యూరిటీ అడ్వైజర్ వ్యాఖ్యానించారు. కిమ్ ఓ యానివర్సరీకు వెళ్లారు. అతని గైర్హాజరీతో నెలకొన్న సందేహాలకు తోడుగా రూమర్లు సృష్టించారు. ‘మా ప్రభుత్వానికి ఇక్కడ ఎటువంటి డోకా లేదని స్పష్టం చేశారు.
అడ్వైజర్ మూంగ్ చాంగ్ ఇన్ CNN న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం జరిగిన ఇంటర్వ్యూలో కిమ్ జాంగ్ ఉన్న క్షేమంగానే ఉన్నారని ఏప్రిల్ 13నుంచి వొన్సాన్ లోని రిసార్ట్ లో ఉంటున్నారని తెలిపారు. ఎటువంటి అనుమానస్పద పరిస్థితులు కనిపించలేదని అంతా బాగానే ఉందని అన్నారు.
ఏప్రిల్ 15న కిమ్ తాతగారి పుట్టినరోజు వేడుకల తర్వాత నుంచి దేశాధ్యక్షడు కిమ్.. కనిపించకుండాపోయారు. దేశ క్యాలెండర్ లో ఇది చాలా కీలకమైన రోజు దేనికంటే జిన్ పింగ్ ఉన్న తాతగారి పుట్టిన రోజు కాబట్టే. అంతకుముందు ఏప్రిల్ 11న జరిగిన పార్టీ పాలిట్ బ్యురోకు కూడా హాజరుకాలేదు.
వీటి ఆధారాలతోనే మీడియా మొత్తం అతని అనారోగ్యంపై వార్తలు వినిపిస్తున్నాయి. వీరందరి ఆశలపై నీళ్లు చల్లుతూ సెక్యూరిటీ ఆఫీసర్లే నిజాలు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే కిమ్ గురించి ప్రత్యేక మూమెంట్ లు ఏమీ కనిపించడం లేదు. కొన్ని చోట్ల కిమ్.. కార్డియో వాస్కులర్ చికిత్స్ తీసుకుంటున్నారని కోలుకున్న తర్వాతే కనిపిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.