2021లో మహా వినాశనం.. 2020 కంటే వెరీ డేంజర్ : నోస్ట్రడామస్ జోస్యం!

2021లో మహా వినాశనం.. 2020 కంటే వెరీ డేంజర్ : నోస్ట్రడామస్ జోస్యం!

Updated On : January 10, 2021 / 10:50 AM IST

Nostradamus predictions for 2021: 2020 అనగానే టక్కున గుర్తొచ్చేది కరోనా.. ఈ కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి దాదాపు 2 మిలియన్ల మంది మరణించారు. ప్రకృతి వైపరిత్యాల కంటే రికార్డు స్థాయిలో కరోనా విపత్తు సంభవించింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని ఇప్పుడెప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు. 2021 అయినా బాగుంటుదిలే అంతా అనుకుంటుంటే.. ఈ ఏడాదిలో మహా ప్రళయం ముంచుకొస్తోందంట.. భూమిపై మానవ జాతి అంతానికి ఇది సంకేతమా? 2021లో రాబోతున్న మహా ప్రళయం ఏంటి? అసలు ఏం జరుగబోతుంది ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది.

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు.. ప్రాన్స్ కు చెందిన ఖగోళ వేత్త, సిద్ధాంతకర్త, నోస్ట్రడామస్‌ 2021లో మహాప్రళయం ముంచుకోస్తోందంటూ జోస్యం చెప్పాడు. ఆకాశంలో నక్షత్రాల్నిచూస్తూ భవిష్యత్తును పక్కగా అంచనా వేయడంలో నోస్ట్రడామస్ సిద్ధహస్తులు. 2021 భవిష్యత్తులో జరుగబోయే పరిణామాలపై ఆయన చెప్పిన జోస్యం నిజమవుతుందా? ఇప్పటివరకూ నోస్ట్రడామస్‌ చెప్పిన ఒక్కటీ తప్పుగా రుజువుకాలేదు. ఆయన అంచనా ఇప్పటివరకూ తప్పలేదు.
 Nostradamus predictions for 2021 sound pretty bad

20వ శతాబ్దంలో ఏం జరుగబోతుందో 400ఏళ్ల కిందటే నోస్ట్రడామస్‌ ఊహించాడు. అపోకలిప్స్, జాంబీస్ అంటూ అంతగా భయపెట్టిస్తున్న ఈ 16వ శతాబ్దపు జ్యోతిష శాస్త్రజ్ఞుడు చెప్పిన కొన్ని షాకింగ్ విషయాలు భయాందోళన కలిగిస్తున్నారు. అదే.. బయోలాజికల్ వెపన్ వైరస్.. రష్యా ఈ బయోలాజికల్ వెపన్ తయారుచేస్తోందంట.. ఈ వెపన్ నుంచి ఉత్పత్తి అయ్యే వైరస్.. యావత్ ప్రపంచాన్ని అంతం చేస్తుందని జోస్యం చెప్పాడు.
Nostradamus predictions 2021
ఈ ఏడాదిలో భారీగా సౌర తుఫాన్లు సంభవిస్తాయంట.. ఈ ప్రళయం నుంచి ఎవరూ తప్పించుకోలేరంట.. భూమికి తీవ్రంగా నష్టం కలిగిస్తాయని అన్నారు. భారీగా వాతావరణంలో మార్పులు వస్తాయని చెప్పారు. అలాగే యుద్ధాలు కూడా జరుగుతాయంట.. భారీ తోకచుక్క ఒకటి భూమిపైకి దూసుకొస్తుందంట.. మహా ప్రళయం సంభవిస్తుందంట.. దీని ధాటికి భారీ భూకంపాలు, విపత్తులు, సునామీలు సంభవిస్తాయంట.. అలాగే ఆకాశం నుంచి ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుందంట..
2021లో జరుగబోయే ఈ మహా వినాశనం సమయంలో ఆకాశమంతా ఎర్రబారుతుందంట.. అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గ్రహశకలం.. KF1 2009. 2021.. మే 6న భూమికి అతి దగ్గరగా రానుంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే మాత్రం భారీ పేలుడు సంభవిస్తుందంట. 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే… 15 రెట్లు ఎక్కువ శక్తి ఉత్పన్నమవుతుంది.

అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలు చాలా తక్కువేనంట. నోస్ట్రడామస్ మొత్తం 6,338 విషయాలపై జోస్యం చెప్పాడు. చాలా వరకూ ఇప్పటికే జరిగాయి. నోస్ట్రడామస్ చెప్పిన జోస్యాల్లో 70 శాతం నిజమయ్యాయి. 2021లో భారీ భూకంపం.. కొత్త ప్రపంచాన్ని నాశనం చేస్తుంది చెప్పాడు. మనుషులు.. ప్రత్యేకించి సైనికులు తమ శరీరాల్లో, మెదళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ను సెట్ చేసుకుంటారంట.. 2021లోనైనా అంతా మంచి జరగాలని కోరుకుందాం.. ఇది నిజం కాకుంటే బాగుండూ అని ఆ దేవున్ని ప్రార్థించడం తప్ప చేసేదేమి లేదు..