అయినా బతికాడు : డోర్ బెల్ కొట్టాడు.. ముఖంపై పాము కాటేసింది!
ఇంట్లోకి ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తే.. పెంపుడు కుక్కలు అరవడం కామన్. కొన్నిసార్లు వచ్చిన అతిథులపై ఎగబడి కరుస్తాయి కూడా. కానీ, ఇక్కడ కరిచింది కుక్క కాదు..

ఇంట్లోకి ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తే.. పెంపుడు కుక్కలు అరవడం కామన్. కొన్నిసార్లు వచ్చిన అతిథులపై ఎగబడి కరుస్తాయి కూడా. కానీ, ఇక్కడ కరిచింది కుక్క కాదు..
ఇంట్లోకి ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తే.. పెంపుడు కుక్కలు అరవడం కామన్. కొన్నిసార్లు వచ్చిన అతిథులపై ఎగబడి కరుస్తాయి కూడా. కానీ, ఇక్కడ కరిచింది కుక్క కాదు.. పాము.. అదేంటీ.. ఇంట్లో పాములను కూడా పెంచుకుంటున్నారా? అనుకుంటే పొరపాటే.
అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఇంటిపైకి మెల్లగా పాకుతూ డోర్ బెల్ కు వేలాడుతోంది. అదే సమయంలో జెరల్ హేహుడ్ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చి డోర్ బెల్ మోగించాడు. వెంటనే అతడి ముఖంపై పాము కాటేసింది. ఈ షాకింగ్ ఘటన ఒక్లామాలోని లాటన్ నగరంలో జరిగింది. పాము కాటేసిన దృశ్యం.. అక్కడి డోర్ బెల్ కెమెరాలో రికార్డు అయింది.
ఆ రోజు ఆదివారం.. లాటన్ నివాసి జెరల్ హేహుడ్.. పక్కంటిలో ఉన్న రోడ్నీ కోప్ ల్యాండ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు కారు పార్క్ చేశాడు. మెల్లగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. డోర్ బెల్ మోగించాడు. తలుపు తీయగానే.. డోర్ బెల్ కు వేలాడుతున్న పాము.. హేహుడ్ ముఖంపై కాటు వేసింది.
షాకైన అతడు నన్ను.. పాము కరిచిందంటూ ఇంట్లోకి పరిగెత్తాడు. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లండి బాబోయ్.. అంటూ భయంతో గట్టిగా కేకలు వేశాడు. అదృష్టవశాత్తూ హేహుడ్ ను కరిచింది విష స్పరం కాకపోవడంతో ప్రమాదం తప్పింది. మశ్వాన్ కోప్ ల్యాండ్ ఈ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియో ఇదే..