Omicron Cases: వామ్మో ఒమిక్రాన్.. 21దేశాల్లో వెలుగులోకి కొత్త వేరియంట్!
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు అన్ని దేశాలకు విస్తరిస్తోంది.

Omicron
Omicron: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 21దేశాలలో రెండొందల ముప్పైకి పైగా కేసులు నమోదవ్వగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. లేటెస్ట్‌గా ఈ వేరియంట్ దక్షిణకొరియాకు కూడా సోకింది. దక్షిణ కొరియాలో కొత్తగా ఒకే రోజు ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. నైజీరియా నుంచి వచ్చిన వారిలో ఈ వేరియంట్ వెలుగుచూసింది.
నవంబర్ 24న నైజీరియా నుంచి వచ్చిన ఇద్దరు దంపతులతో పాటు.. వారిని ఆహ్వానించి తన ఇంటికి తీసుకెళ్లిన బంధువులలో ఒమిక్రాన్ వెలుగు చూసినట్టు దక్షిణ కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ వెల్లడించింది. అలాగే, అంతకముందు నైజీరియా వెళ్లి నవంబర్ 23న దక్షిణ కొరియాకు వచ్చిన ఇద్దరు మహిళల్లోనూ ఈ వైరస్ వెలుగుచూసినట్టు తెలిపింది. యూనియన్‌లోని 11 దేశాల్లో ఇప్పటివరకూ 44 కేసులు నమోదయ్యాయి.
Twitter Rules: ట్విట్టర్ రూల్స్ మార్చేశారు.. ఆ పోస్టులకు చెక్
డెల్టా వేరియంట్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ఆదివారం నుంచే చర్యలను కట్టుదిట్టం చేసింది. దక్షిణాఫ్రికాతో పాటు మరో 7 దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించింది. అలాగే, ఆ దేశాల నుంచి వచ్చే దక్షిణ కొరియా పౌరులు వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని నిబంధనలు విధించింది.
ఇప్పటివరకు ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన దేశాలు దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, నైజీరియా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్, బ్రెజిల్, నెదర్లాండ్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్, బోట్స్వానా, స్పెయిన్, మిగిలినవి యూరోపియన్ దేశాలు.. అయితే ఇండియా, చైనా, అమెరికాలో మాత్రం ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి రాలేదు.