Omicron Variant : ఒమిక్రాన్‌ వేవ్ వచ్చినా ఆందోళన వద్దు.. జాగ్రత్తలు మరువద్దు..!

ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. భారత్ సహా ఇతర దేశాల్లో ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. ఈ వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు సైంటిస్టులు.

Omicron Variant : ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. అయితే ఈ వేరియంట్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు యూకే సైంటిస్టులు. ఎందుకంటే.. ఒమిక్రాన్.. అదేదో కొత్త వైరస్ కాదని.. ఇదివరకే  చూసిన కరోనా వంటి వైరస్ లాంటిదేనని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టు ఒకరు వెల్లడించారు. గత ఏడాదిగా మనం చూస్తున్న కరోనా వైరస్ వంటిదేనని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ దాని తీవ్రత తక్కువగానే ఉందని నివేదికలు సైతం చెబుతున్నాయి.

గత ఏడాదిలో నవంబర్ చివరివారంలో ఈ ఒమిక్రాన్ వైరస్ మొదటిసారిగా గుర్తించామని తెలిపారు. ఈ వేరియంట్ తీవ్రత మాత్రం తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోందని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అధ్యాపకులు జాన్ బెల్ అంతర్జాతీయ మీడియాతో అన్నారు. ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉందని ఆక్స్‌ఫర్డ్‌లోని మెడిసిన్ రెజియస్ ప్రొఫెసర్ జాన్ బెల్ BBC రేడియో 4 టుడే కార్యక్రమంలో వెల్లడించారు.

Read Also : Telangana Corona : థర్డ్ వేవ్‌‌కు సంకేతం ఇదే…అప్రమత్తంగా ఉండాలి

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల వైఫల్యంతో 2020 ఏడాది నవంబర్‌లో కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరిందని, అది చరిత్రలో నిలిచిపోయిన అత్యంత ప్రమాదకర పరిస్థితులుగా పేర్కొన్నారు. అప్పటి పరిస్థితుల్లో కరోనా బాధితులతో ఐసియులు పూర్తిగా నిండిపోయాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ఆ పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని ప్రభుత్వాలు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

2021 ఏడాది చివరలో ఇంగ్లాండ్‌లో కరోనా ఆంక్షలు విధించడం లేదంటూ ఇటీవలే బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన వారం రోజుల్లో బ్రిటన్‌లో కరోనా కేసులు 15 లక్షలను దాటాయి. దీనిపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పందించాలంటూ తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి జావిద్.. ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు శానిటైజింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Read Also : DTC Buses Vandalised : కోవిడ్ నిబంధనలపై ఆగ్రహం..బస్సులు ధ్వంసం

ట్రెండింగ్ వార్తలు