భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం జరిగి ఉంటేనా..? ఆ యుద్ధాన్ని ఇలా ఆపాను: ట్రంప్
అందుకే తాను చెప్పగానే భారత్, పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు చెప్పారు.

భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం జరిగి ఉంటే భారీ వినాశనం జరిగి ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అణ్వాయుధ దేశాలైన భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తాను నివారించానని చెప్పారు.
ఒకవేళ అణు యుద్ధం జరిగితే లక్షలాది మంది ప్రాణాలు పోయేవని ట్రంప్ అన్నారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో జేడీ వాన్స్, రుబియో చాలా కృషి చేశారని తెలిపారు. యుద్ధాన్ని ఆపడంలో తాను వాణిజ్యాన్ని వాడినట్లు ఎవరూ వాడలేదని అన్నారు. తాను యుద్ధాన్ని ఆపడంలో మధ్యవర్తిత్వం చేశానని చెప్పారు.
Also Read: వారు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బ తీసింది: జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం
ఇరు దేశాలతో అమెరికా మాట్లాడిందని, కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పుకున్నాయని ట్రంప్ అన్నారు. ఇందుకు తాను వాణిజ్యాన్నే ఆయుధంగా చేసుకుని, కాల్పుల విరమణ జరగకపోతే వాణిజ్యాన్ని నిలిపివేస్తానని చెప్పానని తెలిపారు. తాను చెప్పగానే భారత్, పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు చెప్పారు.
కాగా, భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. యుద్ధ సమయంలో ఇరు దేశాలు విజ్ఞత పాటించినందుకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. తమ దేశ మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ మంతనాల తర్వాత తక్షణ, సంపూర్ణ విరమణకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని అన్నారు. ఇప్పుడు కూడా తమ మధ్యవర్తిత్వంతోనే యుద్ధం ఆగిందని అంటున్నారు.