Osama bin Laden : ఒసామా బిన్ లాడెన్ ఫ్యామిలీ వదిలేసిన విలాసవంతమైన ఈ ప్రాపర్టీ విలువెంతో తెలుసా?
బిన్ లాడెన్ మరణించిన అతడికి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ఆస్తుల వివరాలపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లాడెన్ ఫ్యామిలీ వదిలేసిన అత్యంత విలాసవంతమైన నివాసం గురించి ఎప్పుడైనా విన్నారా?

Osama Bin Laden’s Family’s Abandoned Bel Air Estate List (3)
Osama bin Laden abandoned Bel Air estate : ప్రపంచాన్ని గజగజ వణికించిన అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నేత, 9/11 దాడుల ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ అమెరికా సైనిక బలగాల చేతుల్లో మరణించి 8 ఏళ్లు దాటింది. లాడెన్ నాయకత్వం వహించిన అల్ ఖైదా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జిహాదీ గ్రూపుగా భావించేవారు. లాడెన్ మరణానంతరం అల్ ఖైదా ప్రభావం చాలా తగ్గిపోయింది. అయితే బిన్ లాడెన్ మరణించిన అతడికి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ఆస్తుల వివరాలపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లాడెన్ ఫ్యామిలీ వదిలేసిన అత్యంత విలాసవంతమైన నివాసం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు తెలుసుకోండి..
సోదరుడు ఇబ్రహీం సొంత ప్రాపర్టీ ఇదే :
ఒసామా బిన్ లాడెన్ సోదరుడు ఇబ్రహీం బిన్ లాడెన్ వదిలివెళ్లిన అత్యంత విలాసవంతమైన Bel Air mansion అనే ప్రాపర్టీ విలువ ఎంతో తెలుసా? అక్షరాల 28 మిలియన్ల డాలర్లు. అంటే.. (2,08,26,20,400) ఉంటుందని ఓ నివేదిక అంచనా వేసింది. ఇబ్రహీంకు 1983 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాపర్టీ కలిగి ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి.
అప్పట్లో ఇబ్రహీం Mediterranean villa-style mansion ప్రాపర్టీని 1,653,000 డాలర్లకు కొనుగోలు చేశాడు. 38ఏళ్ల తర్వాత ఈ ప్రాపర్టీ విలువ 5.5 మిలియన్ డాలర్లు వరకు పెరిగింది. కానీ, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత నుంచి ఈ లగ్జరీ విల్లాను ఇబ్రహీం వదిలేశాడు. దాదాపు 20ఏళ్లుగా ఈ ఇంట్లో ఉండటం లేదని నివేదిక తెలిపింది.
ప్రస్తుతం ఈ విల్లా హౌస్ వదిలేసిన స్థితిలో కనిపిస్తోంది. ల్యాండ్ విలువ, లొకేషన్ ఆధారంగా ప్రాపర్టీ ధర ఉండొచ్చు. ఇబ్రహీం లాడెన్ విల్లా హౌస్ 7,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే 2 ఎకరాలకు పైగా ల్యాండ్ కలిగి ఉంది. ఈ ఇంటిలో ఏడు బెడ్ రూంలతో పాటు ఐదు బాత్ రూంలు ఉన్నాయి. 1931లో ఈ ఇంటిని నిర్మించారు.
అలాగే కాంక్రీట్ భవనానికి పింక్ పెయింట్ వేశారు. Hotel Bel-Air నుంచి కిందికి కొన్ని డోర్ లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇంటిరియర్ ఫొటోలు శిథిలావస్థకు చేరుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న అనేక పామ్ చెట్లు కనిపిస్తున్నాయి. స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది.
సెప్టెంబర్ 11 దాడుల తర్వాత :
ఇబ్రహీం.. తన మాజీ భార్య (Christine Hartunian Sinay)తో ఈ విల్లా హౌస్‌లోనే కలిసి ఉండేవాడట.. తమతో పాటు కుమార్తె Sibba Hartunian కూడా ఉండేవారట. అలాగే ఇంట్లో ఫుల్ టైమ్ హౌస్ కీపర్లు పనిచేసేవారు.. ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉందని Steve Coll’s Bookలో రాసి ఉంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఇబ్రహీం.. విదేశాల్లోనే ఉన్నాడు. అప్పటినుంచి అమెరికాకు తిరిగా రాలేదు. అప్పటినుంచి ఈ ఇంటిని అద్దెకు ఇచ్చేశాడు.
2010 వరకు ఈ ఇంటిని పోర్నోగ్రాఫిక్ మూవీ షూటింగ్స్ కోసం వినియోగించేవారట.. ఒసాబా బిన్ లాడెన్ మాదిరిగానే ఇబ్రహీం కూడా సౌదీ అరేబియన్ టైకూన్ మహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ 56 మంది సంతానంలో ఒకడు. తండ్రి మహమ్మద్.. లాడెన్ కు 22 మంది భార్యలు..
మహమ్మద్.. మల్టీ బిలియనీర్ బిన్ లాడెన్ వంశానికి ఏకైక వారసుడు.. అల్ సౌద్ రాయల్స్‌తో దీర్ఘకాలంగా వ్యాపార సంబంధాలు సాగించాడు. 60వ దశకంలో, ఈ ప్రాపర్టీ.. హాలీవుడ్ నిర్మాత ఆర్థర్ ఫ్రీడ్ ఆధీనంలో ఉండేది.