ఇండియన్ అనుకుని : తమ పైలెట్‌ని కొట్టి చంపిన పాక్ ప్రజలు

విధి రాతను ఎవరూ మార్చలేరు. చావుని ఎవరూ తప్పించలేరు. పాకిస్తాన్ పైలెట్ విషయంలో ఇదే జరిగింది. విమానం కూలినా ప్రాణాలతో బయటపడటం, శత్రువుల చేతికి చిక్కినా

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 10:41 AM IST
ఇండియన్ అనుకుని : తమ పైలెట్‌ని కొట్టి చంపిన పాక్ ప్రజలు

Updated On : March 3, 2019 / 10:41 AM IST

విధి రాతను ఎవరూ మార్చలేరు. చావుని ఎవరూ తప్పించలేరు. పాకిస్తాన్ పైలెట్ విషయంలో ఇదే జరిగింది. విమానం కూలినా ప్రాణాలతో బయటపడటం, శత్రువుల చేతికి చిక్కినా

విధి రాతను ఎవరూ మార్చలేరు. చావుని ఎవరూ తప్పించలేరు. పాకిస్తాన్ పైలెట్ విషయంలో ఇదే జరిగింది. సొంత దేశ ప్రజల చేతిలోనే చనిపోవాల్సి వచ్చింది. విమానం కూలినా ప్రాణాలతో బయటపడటం, శత్రువుల చేతికి చిక్కినా సేఫ్‌గా స్వదేశానికి తిరిగి రావడం భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విషయంలో జరిగింది. ఇదే తరహా ప్రమాదంలో పాకిస్తాన్ పైలెట్ మాత్రం తన ప్రాణాలను కాపాడుకోలేకపోయాడు. సొంత దేశ ప్రజలే అతడిని కొట్టి చంపారు. విమానం కూలిన తర్వాత పాకిస్తాన్ పైలెట్ తన భూభాగంలోనే పడిపోయాడు. అతడిని భారతీయ పైలెట్ అని పొరపాటు పడ్డ పాకిస్తాన్ ప్రజలు.. దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన అతడు.. చికిత్స పొందుతూ మరణించాడు.

బుధవారం(ఫిబ్రవరి-27-2019) ఎఫ్-16 యుద్ధ విమానం నడుపుతూ భారత గగనతలంలోకి పాకిస్తాన్ పైలెట్ షాజుద్దీన్ వచ్చాడు. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ తన మిగ్ 21 విమానంతో దాన్ని తరుముకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో రెండు విమానాలూ కూలాయి. షాజుద్దీన్ ప్యారాచూట్ సాయంతో నౌషేరా సమీపంలోని లీమ్ లోయలో పడిపోయాడు. షాజుద్దీన్ కిందకు వస్తుండటాన్ని చూసిన కొందరు స్థానిక యువకులు అతను కిందకు దిగగానే దాడిచేశారు. అతడిని భారత పైలట్‌గా భావించి ఆగ్రహంతో చితక్కొట్టారు. పాక్ యూనిఫామ్ కనిపిస్తున్నా వారు నమ్మలేదు. ఈ దాడిలో పైలెట్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయి.  చావుబతుకుల మధ్య ఉన్న షాజుద్దీన్‌ను ఆర్మీ రేంజర్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ షాజుద్దీన్ మరణించాడు.

మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి కూడా భారత పైలెట్ అని భావించిన పాక్ వర్గాలు ఇద్దరు పైలెట్లు తమకు చిక్కారని తొలుత ప్రకటించాయి. తర్వాత తప్పు తెలుసుకున్నారు. భారత్‌కు చెందిన ఒక్క పైలెట్ మాత్రమే తమ అదుపులో ఉన్నారని మరో ప్రకటన చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తమ పైలెట్ షాజుద్దీన్ వివరాలను వారు రహస్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. కానీ నిజం వెలుగులోకి వచ్చింది. అసలు విషయం తెలిసి అంతా షాక్ తిన్నారు. స్థానిక మూకల దాడి నుంచి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను రక్షించిన పాక్ సైనికులు.. తమ పైలట్‌ను మాత్రం కాపాడుకోలేకపోయారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పైలట్ షాజుద్దీన్ కొద్ది గంటల్లోనే కన్నుమూశాడని తెలుస్తోంది. లండన్‌కు చెందిన లాయర్ ఖలీద్ ఉమర్ ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నారు. ఆయన చనిపోయిన విషయం కుటుంబ సభ్యులు ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు. అభినందన్‌ తండ్రి లాగే షాజుద్దీన్‌ తండ్రి వసీముద్దీన్‌ కూడా పాక్‌ వాయుసేనలో ఎయిర్‌ మార్షల్‌గా పనిచేయడం విశేషం.