Pakistan: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ దేశంలో దేవాలయాలు, గురుద్వారాల కోసం..

పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని దేవాలయాలు, గురుద్వారాల పునరుద్దరణ, సుందరీకరణ కోసం ..

Pakistan: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ దేశంలో దేవాలయాలు, గురుద్వారాల కోసం..

Pakistan PM Shehbaz Sharif

Updated On : February 23, 2025 / 1:04 PM IST

Pakistan: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని దేవాలయాలు, గురుద్వారాల పునరుద్దరణ, సుందరీకరణ కోసం ఒక బిలియన్ పాకిస్థాన్ రూపాయలను (సుమారు రూ.30 కోట్లు) ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. చీఫ్ సయ్యద్ అత్తౌర్ రెహమాన్ నేతృత్వంలో జరిగిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ETPB) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో హిందూ, సిక్కు వర్గాల సభ్యులు, అలాగే ప్రభుత్వ, ప్రభుత్వేతర సభ్యులు హాజరయ్యారు.

 

ఈటీపీఎఫ్ అభివృద్ధి పథకం గురించి బోర్డు కార్యదర్శి ఫరీద్ ఇక్బాల్ మాట్లాడుతూ.. మైనార్టీ ప్రార్ధనా స్థలాల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. చాలాకాలంగా ఉపయోగించని భూములను అభివృద్ధికి ఇవ్వడం ద్వారా శాఖ ఆదాయం అనేక రెట్లు పెరుగుతుందని చెప్పారు. శాఖ ఆదాయాన్ని పెంచడానికి పథకాన్ని మార్చి తరువాత, ట్రస్ట్ ఆస్తులను ఇప్పుడు అభివృద్ధి కోసం సమర్పించడం జరుగుతుందని చెప్పారు.

 

దేవాలయాలు, గురుద్వారాల అభివృద్ధి, పునరుద్దరణ పనులకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ను నియమించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా.. కర్తార్ పూర్ కారిడార్ లో కార్యాచరణ పనులకోసం ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ ను ఏర్పాటు చేసే ప్రణాళికపై కూడా సమావేశంలో చర్చించారు.

 

ఇదిలాఉంటే.. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ లోని మైనార్టీలపై దాడులు పెరిగాయి. 1947లో పాకిస్థాన్ విభజన తరువాత అక్కడ ముస్లీమేతర జనాభా 14.2శాతంగా ఉంది. అదిఇప్పుడు 3.53శాతానికి తగ్గింది. పాకిస్థాన్ లో 1800కిపైగా సిక్కు గురుద్వారాలు, హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే, వాటిలో ప్రస్తుతం 31 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పురాతన చారిత్రక దేవాలయాలు, గురుద్వారాల పునరుద్దరణలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఎఫ్టీబీపీతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ దేవాలయాలు, గురుద్వారాల అభివృద్ధి, పునరుద్దరణ పనుల కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్ ను నియమించేందుకు నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ లో వారు అభివృద్ధి చేయనున్న స్థలాల పేర్లను వెల్లడించలేదు.