Mehwish Hayat : నా బ్రా రంగుతో ఏం పని? ఘాటుగా బదులిచ్చిన నటి
పాకిస్తాన్ సినీ నటి, ప్రముఖ టెలివిజన్ తార మెహ్విష్ హయత్ కు కోపం వచ్చింది. ట్రోలర్స్ పై ఆమె విరుచుకుపడింది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.

Mehwish Hayat
Mehwish Hayat : పాకిస్తాన్ సినీ నటి, ప్రముఖ టెలివిజన్ తార మెహ్విష్ హయత్ కు కోపం వచ్చింది. ట్రోలర్స్ పై ఆమె విరుచుకుపడింది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది, మీరు ఎదగాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ ఘాటుగా బదులిచ్చింది.
అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే(ఆగస్టు 14) ను పురస్కరించుకుని మెహ్విష్ జాతీయ జెండా పట్టుకుని ఫొటోలు దిగింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఓ సందేశంతో వాటిని పోస్ట్ చేసింది. అసలే సెలబ్రిటీ. అంతే.. ఆ ఫొటో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అయితే, కొందరు వ్యక్తులు ఆమె వేసుకున్న బ్రా రంగుపై నీచమైన కామెంట్లు చేశారు. ట్రోల్ చేశారు.
దీనికి మెహ్విష్ ఘాటుగానే బదులిచ్చింది. తన లోదుస్తులపై చేసిన ట్రోల్స్ ను తిప్పికొట్టింది. ”చాలా బాధాకరం. కొందరు వ్యక్తులు చేసిన కామెంట్లు చూస్తే జాలేస్తోంది. నా బ్రా రంగు గురించి మాట్లాడుతున్నారంటే మీరు మానసికంగా ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతుంది. బ్లాక్, గ్రే, గ్రీన్.. నా బ్రా రంగుతో మీకేం పని? మీరు ఇంకా ఎదగాలి. మీకు బుద్దిని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేసింది. కాగా, ఈ నటి ఇలా ట్రోల్ కి గురి కావడం ఇదే తొలిసారి కాదు.
ఇక పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 14) రోజునే మరో దారుణం కూడా జరిగింది. లాహోర్‌లో ప్రముఖ మహిళా టిక్‌టాకర్ పై ఒకేసారి వందల మంది మగవాళ్లు దాడి చేశారు. ఆమె బట్టలు చించేసి.. గాల్లోకి ఎగరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లాహోర్ లోని మినార్ ఏ పాకిస్తాన్ దగ్గర తన స్నేహితులతో వీడియో తీస్తున్న సమయంలో 300 నుంచి 400 మంది తమపై దాడి చేసినట్లు మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. తాము తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని.. తన దుస్తులు చించి, గాల్లోకి ఎగరేసి దారుణంగా హింసించారని ఆమె తెలిపింది.
‘అల్లరి మూక ఏడిపించింది. తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు చించి గాల్లోకి విసిరేసి వికృతానందం పొందారు. నడి బజారులో బట్టల్లేకుండా నడిపించారు. అంతేకాదు.. ఒంటిపైనున్న బంగారు ఆభరణాలు దోచేశారు. సెల్ ఫోన్ లాక్కున్నారు. డబ్బు దొంగిలించారు” అని టిక్ టాకర్ కన్నీటిపర్యంతం అయ్యింది.
View this post on Instagram