Bakasura Restaurant : ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమా.. ఈ తిండిపోతు దయ్యం సినిమా మీరు చూశారా?
ఓ తిండిపోతు ఆత్మ బయటకు వచ్చి ఎలాంటి ముప్పు తిప్పలు పెట్టింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. (Bakasura Restaurant)

Bakasura Restaurant
Bakasura Restaurant : కమెడియన్ ప్రవీణ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్‌జే మూవీస్ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మాణంలో ఎస్‌జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.(Bakasura Restaurant)
బకాసుర రెస్టారెంట్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. నిన్నటిదాకా ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు టాప్ 4 లో బకాసుర రెస్టారెంట్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. అలాగే ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఓటీటీలో రిలీజయిన మూడు రోజుల్లోనే ఈ సినిమా ఈ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
Also Read : Raashii Khanna : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్.. పవన్ తో రాశీ ఖన్నా స్పెషల్ సెల్ఫీ వైరల్..
కొంతమంది బ్యాచిలర్స్ కి అనుకోకుండా తాంత్రిక విద్యల పుస్తకం దొరకడంతో అందులో ఉన్న ఓ మంత్రాన్ని జపించడంతో ఓ తిండిపోతు ఆత్మ బయటకు వచ్చి వీళ్లను ఎలాంటి ముప్పు తిప్పలు పెట్టింది అనే కథాంశంతో హారర్ కామెడీగా ఈ సినిమాని తెరకెక్కించారు.