Guinness World Record : ఆ ఫ్యామిలీలో 9 మంది ఒకే రోజు పుట్టారు.. ప్రపంచ రికార్డు సాధించారు..
పుట్టినరోజు అంటే భగవంతుడు నిర్ణయించిన రోజు. ఒక కుటుంబంలో 9 మంది ఒకే రోజు పుట్టడం అంటే .. అద్భుతం కదా.. అందరూ కలిసి పుట్టినరోజు వేడుక చేసుకునే ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఉందా? .. చదవండి.

Guinness World Record
Guinness World Record : ఫ్యామిలీలో ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు అయితేనే హ్యాపీ అయిపోతాం. అలాంటిది ఓ ఫ్యామిలీలో అందరూ ఒకేరోజు జన్మించి ఉంటే? అందరూ ఒకేరోజు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటే? వండర్ కదా.. అందుకే ప్రపంచ రికార్డ్ సాధించింది ఆ కుటుంబం.
Sri Lanka : మాజీ సైనికుడి కిడ్నీలో 801 గ్రాముల రాయి .. ఇదో ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ లర్కానాకు చెందిన అమీర్, ఖుదీజాలకు ఆగస్టు 1 అంటే చాలా ప్రత్యేకం. తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఉన్న అతని కుటుంబంలో అందరిది ఒకేరోజు పుట్టినరోజు మరి. అంతేనా వాళ్లిద్దరి పెళ్లిరోజు కూడా ఆరోజే కావడం విశేషం. ఈ జంట 1991 లో తమ పుట్టినరోజు నాడే పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత పెద్ద కూతురు సింధు పుట్టింది. ఆ తరువాత ససూయి- సప్నా, అమిర్-అంబర్, అమ్మర్-అహ్మర్ అనే కవలలకు ఆగస్టు 1 నాడే జన్మనిచ్చారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్ధానం సంపాదించుకున్నారు. ఇక ఒకే రోజు జన్మించిన అత్యధిక కవల తోబుట్టువుల రికార్డు కూడా వీరే సొంతం చేసుకున్నారు.
అయితే తాము పిల్లలు ఒకేరోజున పుట్టాలని ప్లాన్ చేసుకోలేదని.. అదంతా సహజంగానే జరిగిందని అమీర్, ఖుదీజా దంపతులు చెప్పారు. పిల్లలందరూ నార్మల్ డెలివరీ ద్వారా పుట్టడం విశేషం. ఇక ఆగస్టు 1 వస్తే వారి కుటుంబంలో పెద్ద వేడుక. 9 మంది కలిసి కేక్‌ను కట్ చేస్తారట. ఈ ప్రపంచ రికార్డు సాధించడం చాలా సంతోషం ఇస్తోందని ఆ కుటుంబం చెబుతోంది. నిజంగానే ఇది అరుదైన విషయం కదా.. ఆ కుటుంబం సాధించిన ఘనత చూసి వారి బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.