కఠిన నిర్ణయాల సమయమిది : పాక్ ఆర్థికమంత్రి రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 12:59 PM IST
కఠిన నిర్ణయాల సమయమిది :  పాక్ ఆర్థికమంత్రి రాజీనామా

Updated On : April 18, 2019 / 12:59 PM IST

పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ తన పదవికి రాజీనామా చేశారు.మంత్రివర్గం నుంచి వైదొలిగినట్లు గురువారం(ఏప్రిల్-18,2019)పీటీఐ పార్టీ దిగ్గజనాయకుడైన అసద్ ప్రకటించారు. సంక్షోభ సమయంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలతోపాటు వ్యాపార వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో అసద్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : హైదరాబాద్‌లో ఈడీ సోదాలు : రూ.82 కోట్ల విలువైన 146కిలోల బంగారం స్వాధీనం

ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఇది అని గురువారం విలేఖర్ల సమావేశంలో అసద్ తెలిపారు. తనను పదవి నుంచి తొలగించడానికి కుట్ర జరుగుతున్నదో, లేదో తనకు తెలియదన్నారు.మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా  ఆర్థిక మంత్రిత్వ శాఖకు బదులుగా ఇంధన శాఖ తీసుకోవాలని ఇమ్రాన్ కోరారని, అందుకు తాను తిరస్కరించానని,ఏ మంత్రిపదవి తీసుకోనని చెప్పానని,దీనికి ఇమ్రాన్ ఆమోదం లభించిందని అసద్ తెలిపారు.

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా అసద్ మెలిగేవారు.అసద్ ఇటీవలే అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)తో చర్చలు జరిపారు.తన అమెరికా పర్యటన గురించి ప్రస్తావిస్తూ… గతంలో కన్నా మెరుగైన నియమ, నిబంధనలతో ఐఎంఎఫ్ ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.