ఒంటరినైపోయాను : ఏనుగుకు ఘనంగా ఫేర్ వెల్ పార్టీ..

Pakistan Elephant Farewell Party.. :సంగీతం, విందులు, పాటలు, బెలూన్లతో, పాకిస్తాన్ లో ఉంటున్న ఏకైక ఆసియా ఏనుగుకు జూ అధికారులు ఘనంగా వీడ్కోలు పార్టీ అరేంజ్ చేశారు. ఇస్లామాబాద్ జంతుప్రదర్శనశాలలో ఉండే ‘కావన్’అనే ఏనుగుని కంబోడియాకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దానికి ఘనంగా వీడ్కోలు పార్టీ అరేంజ్ చేసిన విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. బెలూన్లతో జూలో కావన్ ఉండే ప్రాంతాన్ని అందంగా అలంకరించారు. ‘‘కావన్ నిన్ను మేం మిస్ అవుతాం’’ అని రాసి పోస్టర్ కూడా ఏర్పాటు చేశారు.
జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించే కావన్ ను తగిన ప్రాంతానికి మార్చాలని జంతువుల హక్కుల కార్యకర్తల డిమాండ్లతో కావన్ ను కంబోడియాకు మకాం మార్చేందుకు వీడ్కోలు పార్టీ అరేంజ్ చేశారు. నవంబర్ 29న కావన్ ను కంబోడియా తరలించనున్నారు. దీంతో పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో margur జూలో ఉండే కావన్ కొత్త ఇంటికి మారనుంది. కంబోడియాలోని ఏనుగుల అభయారణ్యానికి మార్చబడుతుంది.
కాగా ఇస్లామాబాద్ జూలో ఒంటిరిగా ఉంటున్న కావన్ ను తోటి ఏనుగులు ఉండే ప్రాంతానికి తరలించాలని అది జంతువుల హక్కు అని జంతు హక్కుల సంఘం కోర్టును ఆశ్రయించారు. ఒంటిరిగా ఉన్న కావన్ అనే ఏనుగు దిగులుగా ఉంటోందని అది సరైంది కాదంటూ కావన్ పరిస్థితిని కోర్టుకు వివరించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఏనుగుతో పాటు అటువంటి పరిస్థితుల్లో ఉన్న అన్ని జంతువులను తోటి జంతువుల వద్దకు చేర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు.
దీంతో కవాన్‌ను ఆదివారం (నవంబర్ 29,2020)న కంబోడియాలోని వన్యప్రాణుల అభయారణ్యానికి తరలించనున్నట్లు పాకిస్తాన్ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సలీం షేక్ తెలిపారు. కావన్ ను తరలించేందుకు ఒక భారీ లోహపు బోనును ఏర్పాటు చేశారు.
కాగా కొన్ని దశాబ్దా క్రితం కావన్ ను శ్రీలంక నుండి ఇస్లామాబాద్ లోని margjur zooకు తీసుకొచ్చారు. అలా తీసుకొన్ని కావన్ కు భాగస్వామిగా ఉండే ఏనుగు 2012 లో తన మరణించింది.అప్పటి నుంచి అది ఒంటిరిగానే ఉంటోంది. దానికి కొత్త సహచరుడి కోసం దాన్ని కంబోడియాలోని ఏనుగుల అభయారణ్యానికి తరలించనున్నారు.