Pakistan: పాక్ మిస్సైల్ టార్గెట్ ఫెయిల్.. అనుకుందొకటి అయిందొకటి

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంత జంషోరో వాసులు గుర్తు తెలియని వస్తువు ఆకాశం నుంచి కూలుతుండటాన్ని గమనించారు. పెద్ద పొగతో కుప్పకూలుతుండటాన్ని చూసి రాకెట్ లేదా మిస్సైల్ అని ఊహించుకున్నారట

Pakistan: పాక్ మిస్సైల్ టార్గెట్ ఫెయిల్.. అనుకుందొకటి అయిందొకటి

Pak Missile

Updated On : March 18, 2022 / 8:07 PM IST

Pakistan: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంత జంషోరో వాసులు గుర్తు తెలియని వస్తువు ఆకాశం నుంచి కూలుతుండటాన్ని గమనించారు. పెద్ద పొగతో కుప్పకూలుతుండటాన్ని చూసి రాకెట్ లేదా మిస్సైల్ అని ఊహించుకున్నారట. సోషల్ మీడీయాలో ఉంచిన ఇన్ఫర్మేషన్ బట్టి అది పాకిస్తాన్ ప్రయోగించి మిస్సైల్ అని కన్ఫామ్ అయింది.

సింధ్ ప్రాంతానికి టెస్ట్ రేంజ్ దూరంలో ఉన్న మిస్సైల్.. ను గురువారం ఉదయం 11గంటల సమయంలో ప్రయోగించాలనుకున్నారు. కాకపోతే అందులోని ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ లో సమస్య రావడంతో గంట ఆలస్యంగా మధ్యాహ్నం లాంచ్ చేశారు.

అలా ప్రయోగించిన కొన్ని సెకన్లలోనే మిస్సైల్ దిశను మార్చుకుని నేల కూలడాన్ని గమనించారు. అలా తానా బూలా ఖాన్ ప్రాంతంలో క్రాష్ అయింది.

Read Also: ఇండియా నుంచి పాకిస్తాన్‌కు దూసుకెళ్లిన ప్రొజెక్టైల్

ఈ ఘటనను పాకిస్తాన్ లోని కొన్ని న్యూస్ ఛానెల్స్ కవర్ చేసినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకుండా ఊరకుండిపోయారు. పాకిస్తాన్ లోని సోషల్ మీడియా అకౌంట్స్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం.. దాని గురించి వివరించడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది.

పాకిస్తాన్‌లోని ARY న్యూస్ ఛానెల్‌ రిపోర్టర్ ప్రకారం, “విమానం, రాకెట్ లేదా అలాంటిదేదో” కింద పడినట్లు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

గతంలో భారత్ నుంచి పొరపాటున ప్రయోగించిన క్షిపణికి కౌంటర్‌గా పాకిస్థాన్ క్షిపణిని పరీక్షించి ఉండవచ్చని పాక్ వార్తా సంస్థ కాన్‌ఫ్లిక్ట్ న్యూస్ పాకిస్థాన్ నివేదించింది.

“మునుపటి భారత బ్రహ్మోస్ క్షిపణికి ప్రతిస్పందనగా జంషోరో, పాకిస్తాన్ క్షిపణిని పరీక్షించింది. పాకిస్తాన్ క్షిపణి తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమై సమీపంలోనే పడిపోయింది,” అని కాన్ఫ్లిక్ట్ న్యూస్ పాకిస్తాన్ ట్వీట్ చేసింది.