గాల్లో 180 కి.మీటర్లు  : పారా గ్లైడర్ తో ఆడేసుకుంది..

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 05:55 AM IST
గాల్లో 180 కి.మీటర్లు  : పారా గ్లైడర్ తో ఆడేసుకుంది..

ఆస్ట్రేలియా : పారాగ్లైడింగ్ ని అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. రెక్కలు కట్టుకుని గాల్లో పక్షుల్లా ఎగిరిపోవాలనీ..ఉల్లాసంగా..ఉత్సాహంగా ఎగిరిపోవాలని వుంటుంది. కానీ కాస్తంత భయం వెనక్కు లాగుతుంది. కానీ కొంచెం ధైర్యం చేస్తే గాల్లో తేలిపోవచ్చు..అదిగో అదే ఉత్సాహంతో….ఉత్తేజం కోసం  చాలామంది పారాగ్లైడింగ్‌తో ఆ ముచ్చట తీర్చుకుంటారు. ఇది  ఎంత ఉల్లాసంగా ఉంటుందో కొన్నిసార్లు ప్రమాదానికి కూడా దారి తీసే సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ఓ పారాగ్లైడర్‌కు ఇటువంటి ఎక్స్ పీరియన్స్ తో చుక్కలు చూశాడు. అతను గాల్లోకి ఎగరగానే సుడిగాలి చుట్టుముట్టేసింది. అంతే అతన్ని పట్టుకుని అమాంతం గిరిగిరా తిప్పేసి దూరంగా విసిరికొట్టింది. ఆ దెబ్బకు పాపం అతను  కిందపడిపోతాడనీ..ప్రమాదం జరుగుతుందనే అనుకున్నారు. కానీ బతికి బైటపడ్డాడు.. ఆ ఫాస్ట్ కు గాల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిపోయాడు. కంట్రోల్ చేసుకుందామన్నా సాధ్యం కాలేదు. దీంతో గాల్లోనే 180 కిమీలు గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. మనిల్లాలోని మౌంట్ బొరాలో ఈ ఘటన జరిగింది. 

సరిగ్గా అదే సమయంలో అక్కడ 40 మంది పారాగ్లైడర్లు ఎగిరేందుకు రెడీ అవుతున్నారు. ఈక్రమంలో ఈ రేర్ వీడియోను షూట్ చేసింది పారాగ్లైడర్ భార్యే కావటం విశేషం. వీడియోతో పాటు భర్త క్షేమంగా బైటపడటంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ గా సోషల్ మీడియా సుడిగాలిలో గింగిరాలు కొడుతోంది.