Viral Video: ఇజ్రాయెల్ పైకి దూసుకెళ్తున్న క్షిపణుల వీడియోను విమానం నుంచి తీసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్

దుబాయ్ కి వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు మంగళవారం ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ పై వదిలిన క్షిపణులు దూసుకెళ్తున్న సమయంలో వీడియోను రికార్డు చేశాడు.

Viral Video: ఇజ్రాయెల్ పైకి దూసుకెళ్తున్న క్షిపణుల వీడియోను విమానం నుంచి తీసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్

Israel-Iran Conflict

Updated On : October 2, 2024 / 7:51 AM IST

Iranian Rockets videos: పశ్చిమాసియాలో క్షిపణుల మోత మోగుతోంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 400కిపైగా క్షిపణులను ప్రయోగించింది. ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ వారిని బాంబు షెల్టర్లలో ఆశ్రయం కల్పిస్తోంది. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడికి కారణమైన ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : Israel-Iran Conflict: ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్.. రంగంలోకి అమెరికా సైన్యం.. ఇరాన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?

దుబాయ్ కి వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు మంగళవారం ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ పై వదిలిన క్షిపణులు దూసుకెళ్తున్న సమయంలో వీడియోను రికార్డు చేశాడు. న్యూయార్క్ పోస్టు విడుదల చేసిన ఈ పుటేజీలో దాదాపు 200కుపైగా రాకెట్లు ప్రయోగించబడినందున క్షిపణి దాడి తీవ్రతను చూపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 


RAW FOOTAGE: Watch as Iranian missiles rain over the Old City in Jerusalem, a holy site for Muslims, Christians and Jews.