Flight Accident: బలమైన గాలులకు విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు.. 36మందికి తీవ్ర గాయాలు

ఫీనిక్స్ నుంచి హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హోనొలులుకు బయలుదేరింది. ఇందులో 10 మంది క్రూమెంబర్స్, 278 మంది ఫ్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. బలమైన గాలులు వీచిన సమయంలో సీట్ల నుంచి గాల్లోకి ఎగిరినట్లయిందని ప్రయాణికులు పేర్కొన్నారు. కొందరు సీట్లలో నుంచి పైకిఎగిరి విమానం టాప్‌కు బలంగా తగిలారు. మరికొందరు ముందు సీట్లపైకి దూసుకెళ్లారు.

Flight Accident: బలమైన గాలులకు విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు.. 36మందికి తీవ్ర గాయాలు

flight Accident

Updated On : December 20, 2022 / 11:04 AM IST

Flight Accident: మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. ప్రయాణికులు కొందరు సీటు బెల్ట్ తీసి విమానం దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని రీతిలో బలమైన గాలులు విమానాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఇకేముంది.. సీటు బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులు విమానంలో గాలిలో ఎగిరినట్లు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 36 మందికి గాయాలయ్యాయి. వీరిలో 11 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒక ప్రయాణికుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విమానం పైకప్పుకుసైతం క్రాక్స్ వచ్చాయంటే ఎంత బలమైన గాలులు తాకిఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

Flight Accident: దుబాయ్ రన్ వే పై ఎదురెదురుగా విమానాలు, తృటిలో తప్పిన ప్రమాదం

ఫీనిక్స్ నుంచి హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హోనొలులుకు బయలుదేరింది. ఇందులో 10 మంది క్రూమెంబర్స్, 278 మంది ఫ్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. బలమైన గాలులు వీచిన సమయంలో సీట్ల నుంచి గాల్లోకి ఎగిరినట్లయిందని ప్రయాణికులు పేర్కొన్నారు. కొందరు సీట్లలో నుంచి పైకిఎగిరి విమానం టాప్‌కు బలంగా తగిలారు. మరికొందరు ముందు సీట్లపైకి దూసుకెళ్లారు. విమానం పలుమార్లు ఇలానే కుదుపులకు గురైంది. ల్యాండ్ అయిన వెంటనే హొనొలులు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ రంగంలోకి దిగి, గాయపడిన వారికి చికిత్స అందించింది.

Flight Rrestaurant in Hyderab : విమానంలో రెస్టారెంట్ .. మన హైదరాబాద్‌లోనే

ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనని నేను ఎప్పుడూ చూడలేదని ఎయిర్ లైన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జోన్ స్నూక్ అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణీకులను ఆస్పత్రులకు తరలించామని, వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని అన్నారు. ఈ ఘటన సమయంలో పలువురు ప్రయాణికులకు వాంతులుసైతం అయినట్లు ప్రయాణికులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది కమర్షియల్ విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. జులైలో ప్లోరిడాలోని టంపా నుంచి నాష్ విల్లే, టెనస్సికి అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం బలమైన గాలులకు కుదుపులకు గురైంది. ఈ సమయంలో ఎనిమిది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో అత్యవసరంగా విమానం ల్యాండ్ కావాల్సి వచ్చింది. అదేవిధంగా చికాగో నుంచి సాల్ట్ లేక్ సిటీకి వెళ్లే విమానం బలమైన గాలులకు కుదుపులకు గురికావడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.