Dog Final Walk : తన పెంపుడు కుక్క బ్రతకదని తెలిసి ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే కన్నీరు ఆగదు

క్యాన్సర్‌తో బాధపడుతున్న తన పెంపుడు కుక్క ఎక్కువ కాలం బ్రతకదని దాని యజమాని ఘనంగా వీడ్కోలు చెప్పాలనుకున్నాడు. ఇరుగుపొరుగువారికి ఇన్విటేషన్ పంపించాడు. అది చూసిన వారి మనసులు కదిలిపోయాయి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న అతని పోస్టు చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకున్నారు.

Dog Final Walk

Dog Final Walk : పెంపుడు జంతువులకి ఏమైనా అయితే వాటి యజమానులు అస్సలు తట్టుకోలేరు. పెన్సిల్వేనియాలో ఉండే కెవిన్ కురే అనే వ్యక్తి పెంచుకుంటున్న శునకానికి క్యాన్సర్ సోకింది. చివరి క్షణాలు గడుపుతున్న ఆ శునకంపై అతను చాటుకున్న అభిమానానికి కన్నీరు వస్తుంది.

intelligent dog : ఆ శునకం మహా ముదురు .. చదివింది చేసి చూపిస్తున్న డాగ్ వీడియో వైరల్

పెన్సిల్వేనియాలో ఉండే కెవిన్ కురే కుటుంబం మెల్లో అనే డాగ్‌ని పెంచుకుంటోంది. అయితే దానికి ఇటీవల క్యాన్సర్ సోకింది. అది ఎక్కువకాలం బ్రతకదని తెలిసి కెవిన్ దానికి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం ఇరుగుపొరుగువారికి ఓ ఇన్విటేషన్ పంపాడు. అందులో మెల్లో మనసులోని భావం తెలియజేసినట్లుగా రాసాడు. ‘ నేను ఆశించిన దాని కంటే నా జీవితాన్ని చాలా గొప్పగా మార్చారు. గత కొన్ని వారాలుగా నా పరిస్థితి బాగోలేదు. అందర్నీ ఒకసారి కలిసి మీ నుంచి వీడ్కోలు తీసుకోవాలని అనుకుంటున్నాను. మీరు నా తలపై తట్టి.. నా బొడ్డుపై రాస్తే నేను చాలా సంతోషిస్తాను’ అనే నోట్‌ను ఆ ఇన్విటేషన్‌లో జత చేశాడు. ఇన్విటేషన్‌ను ఇరుగుపొరుగు ఇళ్లలో ఇంటి ముందు ఉండే లెటర్ బాక్సుల్లో పోస్ట్ చేశాడు

US University : యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం

ఆ ఇన్విటేషన్ చూసిన ఇరుగుపొరుగువారు బయటకు వచ్చారు. మెల్లోని అభిమానంగా దగ్గరకు తీసుకున్నారు. కొందరు దానిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఈ పోస్టు చూసి నెటిజన్లు సైతం కన్నీటి ఎమోజీలు పోస్ట్ చేశారు. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. మెలో బాగుండాలని కోరుకున్నారు.