శీతాకాలం స్పెషల్ : చెట్లకు చలికోట్లు  

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 11:19 AM IST
శీతాకాలం స్పెషల్  : చెట్లకు చలికోట్లు    

Updated On : November 27, 2019 / 11:19 AM IST

చెట్లకు చలికోట్లు. అదేంటి చెట్లకు చలేస్తుందా? అనే డౌట్ వస్తుంది. అది చెట్ల కోసం వేసిన చలి కోట్లు కాదు. శీతాకాలంలో చలికి వణికిపోయే నిరు పేదల కోసం. నిరాశ్రయులైన నిరుపేదల కోసం చెట్లకు చలికోట్లను (వింటర్ జాకెట్స్)అమర్చిన ఈ వినూత్న ఆలోచన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. టర్కీ, బల్గేరియాలో రోడ్ల పక్కన పుట్ పాత్ లపై బతుకెళ్లదీసే పేదవారి కోసం ఈ చలికోట్లను ఏర్పాటు చేశారు. 

ఎముకలు కొరికే చలి నుంచి పేదప్రజలను కాపాడేందుకు టర్కీ, బల్గేరియా వాసులు వీధుల్లో ఉండే  చెట్లకు ఈ వింటర్ జాకెట్లు తొడిగారు.  ఆ చెట్టుకు తొడిగి ఉన్న జాకెట్లను అవసరమైనవారు తీసుకెళ్లవచ్చు. 

వినూత్నమైన వీడియోలను తన ట్విట్టర్  ద్వారా షేర్ చేసే..ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్షగోయెంకా గతంలో అంటే 2017లో ఈ ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. చలికాలంలో టర్కీ, బల్లేరియాలో ప్రజలు తమ దగ్గరున్న జాకెట్లను నిరాశ్రయులైన పేదవారికి అందించేందుకు ఇలా చేస్తారంటూ ఫొటోలను షేర్ ద్వారా తెలియజేశారు. ఇది శీతాకాలం..చలి వణికించేస్తోంది కాబట్టి..మరోసారి టర్కీ..బల్గేరియా వాసుల ఆదర్శవంతమైన ఆలోచన గురించి మరొక్కసారి..గుర్తు చేస్తూ..అవసరమైనవారు..ఈ జాకెట్లను తీసుకోవాలని సూచిస్తూ..