వామ్మో..చూడండి: సుడిగాలి ఎలా గింగిరాలు తిప్పేసిందో

ఎండాకాలం..ఎండలు మండే కాలం..సుడిగాలుల్లు చుట్టుకొచ్చే కాలం..దాంట్లో చిక్కుకున్నామంటే అది వదలిదాకా బైటపడలేం. చూడటానికి ఇది తమాషాగా ఉంటుంది కానీ దాని బారిన పడితే మాత్రం చుక్కలు చూడాల్సిందే.
సుడిగాలులు వస్తే గ్రామాలలో దాంట్లో దెయ్యం ఉంటుందనీ అది మనల్ని లాక్కెళ్లిపోతుందని భయపెడుతుంటారు. చిన్నప్పుడు అటువంటివి అందరం వినే ఉంటాం. ఇది ఈ వీడియో చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. కాలిఫోర్నియాలోని ఫెయిర్‌ఫీల్డ్ సిటీలో విపరీతంగా గాలిదుమారం వచ్చింది. వెంటనే సుడిగాలులు చుట్టుకొస్తుండటంతో ప్రజలు ఎక్కడివారక్కడ పారిపోతు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. కానీ ఓ వ్యక్తి మాత్రం నిర్లక్ష్యంగా ఏమౌవుద్దిలే అనే ధీమాతో అలగే నడుస్తున్నాడు.
అంతే అతడ్ని సుడిగాలి చుట్టుముట్టేసింది. గిరిగిరా గింగిరాలు తిప్పేసింది. దాంతో అతనికి చుక్కలు కనిపించాయి. అలా అతన్ని తిప్పీ తిప్పీ వదిలేసింది సుడిగాలి.ఈ ఘటన ఫెయిర్‌ఫీల్డ్ సిటీలోని అలన్ విట్ పార్క్‌లో జరిగింది. ఈ దృశ్యాల్నీ అక్కడు లో పార్క్‌లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. సుడిగాలి వచ్చిన సమయంలో పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పు అమాంతం లేచిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫెయిర్‌ఫీల్డ్ ప్రభుత్వం తమ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.