ఒకే ఒక్కడి కోసం తెరుచుకున్న ‘మచు పిచ్చు’

  • Published By: venkaiahnaidu ,Published On : October 14, 2020 / 07:05 PM IST
ఒకే ఒక్కడి కోసం తెరుచుకున్న ‘మచు పిచ్చు’

Updated On : October 14, 2020 / 7:22 PM IST

Machu Picchu opend for single tourist కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలుగా మూతపడి ఉన్న పెరు దేశంలోని ఫేమ‌స్ ప‌ర్యాట‌క ప్రాంతం “మచు పిచ్చు”ని మంగళవారం ఒక్క వ్యక్తి కోసం ఓపెన్ చేశారు. ప్రపంచవింతల్లో మచూ పిచు కూడా ఒకటి. ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా కూడా పేరుగాంచింది.



కాగా, కొన్ని నెలలుగా మూతపడిన మచు పిచ్చు ప్రాంతాన్ని ఓపెన్ చేయడంతో మంగళవారం కేవలం ఒకే ఒక్క జ‌పాన్ ప‌ర్యాట‌కుడు అక్కడికి వెళ్లాడు. ఇన్‌ కా నాగ‌రికుల‌కు చెందిన మ‌చు పిచు శిథిల క‌ట్ట‌డాల‌ను చూసేందుకు కేవ‌లం అతొన్క‌డే టూర్ చేయ‌డం విశేషం. జ‌పాన్‌కు చెందిన‌ జెస్సీ క‌ట‌యామా.. మ‌చు పిచ్చు ప‌ర్వ‌త ప్రాంతాన్ని ఒక్క‌డే ఎక్కాడు.



వాస్త‌వానికి జెస్సీ క‌ట‌యామా..మార్చిలో మచు పిచ్చుని సందర్శించాలనుకున్నాడు. అయితే క‌రోనా వైర‌స్ కారణంగా త‌న ప్లాన్ వాయిదా ప‌డింది. మార్చిలో పెరు చేరుకున్న క‌ట‌యామా..క‌రోనా వైర‌స్ కారణంగా త‌న ప్లాన్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ట్రావెల్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఆ దేశంలోనే ఇన్నాళ్లూ చిక్కుకున్నాడు. అయితే, ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకున్న జెస్సీ క‌ట‌యామా.. తాజాగా ఆ ప్రాచ‌నీ క‌ట్టాల‌ను తిల‌కించాడు. మ‌చు పిచ్చు ప‌ర్యాట‌క ప్రాంతాన్ని వ‌చ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ఓపెన్ చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.