బిగ్ బ్రేకింగ్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు ఉరిశిక్ష

  • Published By: vamsi ,Published On : December 17, 2019 / 07:32 AM IST
బిగ్ బ్రేకింగ్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు ఉరిశిక్ష

Updated On : December 17, 2019 / 7:32 AM IST

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది పాకిస్తాన్‌లోని పెషావర్ హైకోర్టు. ముగ్గురు సభ్యుల ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది కోర్టు. 2007లో ఎమర్జెన్సీకి సంబంధించి ముషారఫ్ తీసుకున్న నిర్ణయంపై పీఎంఎల్ పార్టీ కోర్టును ఆశ్రయించింది.

పీఎంఎల్ పార్టీ పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఆయన దేశద్రోహం చేశారని నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది. మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్.. ప్రస్తుతం అక్కడే తల దాచుకుంటున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

రెండు దశాబ్దాల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్.. సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. దేశ ద్రోహం కేసులో ఆయనపై తీవ్రమైన నేరారోపణలు రావడంతో అతనికి ఉరిశిక్ష విధించింది కోర్టు.