Pfizer Vaccine Store Fridge : ఫైజర్ వ్యాక్సిన్ నెలరోజులు నార్మల్ ఫ్రిడ్జ్‌ల్లో నిల్వ చేయొచ్చు!

అమెరికాకు చెందిన ఫైజ‌ర్ కంపెనీ వ్యాక్సిన్ దీర్ఘకాలం ఫ్రిడ్జ్ లో నిల్వ చేయొచ్చునని యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫైజ‌ర్ వ్యాక్సిన్లను నెలరోజులు సాధారణ ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయొచ్చునని ఈయూ డ్రగ్ రెగ్యులేటర్ పేర్కొంది.

Pfizer Vaccine Store Fridge : ఫైజర్ వ్యాక్సిన్ నెలరోజులు నార్మల్ ఫ్రిడ్జ్‌ల్లో నిల్వ చేయొచ్చు!

Pfizer Vaccine Can Now Be Stored In Fridge For Longer, Eu Drug Regulator Says

Updated On : May 18, 2021 / 12:09 PM IST

Pfizer Vaccine Store Fridge : అమెరికాకు చెందిన ఫైజ‌ర్ కంపెనీ వ్యాక్సిన్ దీర్ఘకాలం ఫ్రిడ్జ్ లో నిల్వ చేయొచ్చునని యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫైజ‌ర్ వ్యాక్సిన్లను నెలరోజులు సాధారణ ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయొచ్చునని ఈయూ డ్రగ్ రెగ్యులేటర్ పేర్కొంది. ఇప్పటివరకూ అతిశీత‌ల ఉష్ణోగ్ర‌త‌ల్లో మాత్రమే స్టోర్ చేయాల్సి ఉంటుంద‌న్నారు. కానీ, ఓపెన్ చేసిన ఫైజ‌ర్ టీకా సీసాలను సాధార‌ణ ఫ్రిడ్జ్‌ల్లో నెల రోజుల పాటు నిల్వ చేయొచ్చునని యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ వెల్లడించింది.

టీకా నియమం ప్ర‌కారం.. ఫైజ‌ర్ టీకాల‌ను ఫ్రిడ్జ్‌లో కేవ‌లం 5 రోజులు మాత్ర‌మే నిల్వ ఉంచాలి. వ్యాక్సిన్ స్టోరేజ్ స‌మ‌యాన్ని పెంచాలని, తద్వారా టీకా స‌ర‌ఫ‌రా కూడా వేగవంతం అవుతుందని ఈయూ తెలిపింది. ఫైజ‌ర్ టీకాలను అతిశీతల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయడం ఇబ్బందికరంగా మారింది. ఫైజర్ టీకాలను కొన్ని దేశాలకు తీసుకువెళ్లే సమయంలో ఫైజ‌ర్ స్టోరేజీకి ఫ్రీజ‌ర్ల అవసరం పడటంతో ఇబ్బందులు త‌లెత్తాయి.

కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. మొద‌ట‌ల్లో మైన‌స్ 80 డిగ్రీల సెంటిగ్రేడ్ వ‌ద్ద నిల్వ చేయాల‌నే నియమం ఉంది. మైన‌స్ 25C ఉష్ణోగ్ర‌త మ‌ధ్య నిల్వ చేయాల‌ని అమెరికా కంపెనీ వెల్లడించింది. ఫైజ‌ర్ టీకాల‌ను 12 నుంచి 15 ఏళ్ల వ‌య‌సున్న పిల్ల‌ల‌కు ఇచ్చేందుకు కెన‌డా ఆమోదించిన సంగతి తెలిసిందే.