United States : రెండవ అంతస్తులోకి దూసుకెళ్లిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

United States : రెండవ అంతస్తులోకి దూసుకెళ్లిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

United States

United States : అమెరికాలో ఓ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ.. ప్రమాదం జరిగిన విధానం చూసి అందరూ షాకవుతున్నారు. కారు ఎంత వేగంతో వస్తే అంత పైకి ఎగిరి ఉంటుందో అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jailer : అమెరికా టైమ్స్ స్క్వేర్‌ను స్వాధీనం చేసుకున్న సూప‌ర్‌స్టార్.. న్యూయార్క్‌లో జైల‌ర్ జ్వ‌రం..

‘జంక్షన్ ఫైర్ కంపెనీ’ (Junction Fire Company) ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. యూఎస్‌లో ఓ ఇంటి రెండవ అంతస్తులోకి కారు దూసుకెళ్లింది. పై కప్పు నుంచి కారు వేలాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెన్సిల్వేనియాలోని జరిగిన ఈ ఘటనలో గాయాలపాలైన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అల్ఫారటా రోడ్డులోని 800 బ్లాక్ లో మధ్యాహ్నం 3 గంటల 15 నిముషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన కారు రెండవ అంతస్తును ఢీ కొట్టడంతో కారు లోనికి చొచ్చుకుని వెళ్లింది.

Anasuya Bharadwaj : అమెరికాలో ఫుల్‌గా చిల్ అవుతున్న అనసూయ..

ప్రమాదం జరిగిన 17 నిముషాల్లో రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి యజమానికి సాయం చేశారు. అందుకు 3 గంటల సమయం పట్టింది. క్రాష్‌కి సంబంధించి ఎంత నష్టం జరిగిందో తెలియలేదు. డ్రైవర్‌ను EMS సిబ్బంది గీసింగ్ లూయిస్‌టౌన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను జంక్షన్ ఫైర్ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అందరూ బాగున్నందుకు సంతోషం అంటూ కామెంట్లు పెట్టారు.