Pigcasso : పంది వేసిన పెయింటింగ్..రూ.20 లక్షలకు కొనేసారు..

పంది వేసిన పెయింటింగ్ వేలం వేయగా ఏకంగా రూ.20 లక్షలకు కొనేసారు..

Pigcasso : పంది వేసిన పెయింటింగ్..రూ.20 లక్షలకు కొనేసారు..

Pigcasso The Piggy Painter (2)

Updated On : December 18, 2021 / 3:02 PM IST

Pigcasso the piggy painter : పెయింటింగులు వేసే పంది.ఎవ్వరి అంచనాలకు అందదు. బ్రష్ పట్టుకుందంటే వరాహంగారి స్పీడ్ అంతా ఇంతా కాదు. క్షనాల్లో కాన్వాసు అంతా రంగులతో నిండిపోవాల్సిందే. ఈ పందిగారు వేసే పెయటింగులకు డిమాండ్ అంతా ఇంతా కాదు. పెయింటింగ్స్ అంటూ పికాసోనే గుర్తుకొస్తారు. కానీ ఈ పంది వేసే పెయింటింగులకు స్ఫూర్తి కూడా పికాసోయే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే దీని పేరు ‘పిగ్‌కాసో’.. అంటే.. పందుల్లో పికాసో అన్నమాట. ఈ పిగ్ కాసో పెయింటిగులకు భలే డిమాండ్ ఉంది. పిగ్‌ కాసో బ్రష్ పట్టుకుందంటే తనదైన రంగుల ప్రపంచాన్ని సృష్టించేయాల్సిందే.

సౌతాఫ్రికాలో ఈ పిగ్ కాసో రంగుల హల్ చల్ చేస్తోంది. పెయింటింగులతో కేక పుట్టిస్తోంది. నిజానికి బిర్యానీలో లెగ్‌పీసు కింద మారాల్సిన ఈ వరాహం..జువానే లెఫ్‌సన్‌ అనే మహిళ పుణ్యామాని బతికి బయటపడింది. ఎలాగంటే..ఈ పంది చిన్నగా ఉన్నప్పుడు దాని యజమాని దీన్ని ఓ మటన్‌ మాంసం వ్యాపారికి అమ్మేశారట..పశ్చిమ కేఫ్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ స్థానికంగా ఫామ్ శాంక్చ్యూరీ నిర్వహిస్తోంది జంతువలంటే ప్రేమ. 2016లో జంతువధ శాలలో ఓ పందిని చూసిన ఆమె రక్షించి..తాను నిర్వహిస్తున్న శాంక్చ్యూరీని తీసుకొచ్చారు. ప్రేమగా పెంచుకుంటున్నారు. అదే సమయంలో తన షాపులోపడిఉన్న పెయింట్‌ బ్రష్షు పట్టుకుని..ఆ పంది ఏవేవో విన్యాసాలు

చేస్తుంటే చూసి..ఆశ్చర్యపోయింది. దాంతో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఆ పంది నోట్లో బ్రష్ పెట్టి..ఓ కాన్వాసు కూడా రెడీ చేసి..రంగులు కూడా సిద్ధం చేసి పెట్టారు. ఇంకేముంది వెంటనే పంది నోటితో బ్రష్ పట్టుకని బొమ్మలు గీయడం ప్రారంభించింది. అదిచూసిన ఆమెకు ఆనందం..ఆశ్చర్యం..ఇక అప్పటినుంచి ఆ పందికి బొమ్మలు గీయటమే పనిగా ఉంటోంది. ఆ పంది వేసిన బొమ్మలు బాగున్నాయని కొంతమంది అనటంతో వాటిని అమ్మితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆమె అమ్మకానికి పెట్టగా వాటిని కొనటం మొదలుపెట్టారు.

అలా ప్రారంభమైంది పిగ్ కాసో బొమ్మల అమ్మకం ప్రస్థానం. తరువాత ఓ వెబ్ సైట్ ఓపెన్ చేసి పంది గీసిన బొమ్మలను అందులో పోస్టు చేసిందామె. దీంతో ఈ చిత్రాలకు ఫిదా అయ్యారు. వేలం పెట్టగా..యమ డిమాండ్ ఏర్పడింది. ఆ బొమ్మల్ని వేలం వేయటం వాటిని ఎగబడి కొనేస్తుండటంతో వరాహం వేసిన పెయింటింగ్‌కు అచ్చంగా వరహాల మూటలే దక్కుతున్నాయి. జర్మనీకి చెందిన పీటర్‌ ఎసర్‌ అనే వ్యక్తి పిగ్ కాసో వేసిన ఓ పెయటింగ్ ను ఏకంగా రూ.20 లక్షలకు పైగా చెల్లించి.. వేలంలో ఈ పెయింటింగ్‌ను దక్కించు కున్నారు. దాంతో పిగ్‌కాసో యజమాని జువానే ఆనందానికి అంతులేదు. మరో విషయం.. ఓ జంతువు వేసిన చిత్రానికి ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి.. గతంలో కాంగో అనే చింపాజీ వేసిన చిత్రానికి రూ.14 లక్షల ధర పలికింది.

ZUKA