మాకు సాయం చేయండి ప్లీజ్.. బోస్నియాలో గడ్డుకట్టే చలిలో నిరాశ్రయుల ఇక్కట్లు..!

Migrants exposed to freezing Bosnia winter : వాయువ్య బోస్నియన్ పట్టణం బిహాక్ చుట్టుపక్కల నిరాశ్రాయులైన వందలాది మంది వలసదారులు ఆశ్రయం పొందుతున్నారు. మంచు గడ్డకట్టే వాతావరణంలో గజగజ వణికిపోతున్నారు. ఎలాగైనా ఈయూ మెంబర్ క్రొయేషియా సరిహద్దుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు తీవ్రమైన మంచు చలిలో సరిహద్దుకు చేరుకునేందుకు ముందుకు సాగుతున్నారు.
ఐరోపా సంపన్న దేశాలకు చేరుకోవడమే లక్ష్యంగా ఆసియా, మధ్యప్రాచ్యం ఉత్తర ఆఫ్రికా నుంచి వేలాది మంది వలస వచ్చినవారికి బోస్నియా 2018 ప్రారంభంలో రవాణా మార్గంలో భాగంగా మారింది. కానీ EU సరిహద్దులను దాటడం చాలా కష్టంగా మారింది. బోస్నియాను జాతిపరంగా విభజించిన ప్రభుత్వం విధానాలతో వందలాది మందికి నిరాశ్రయులయ్యారు. సరైన ఆశ్రయం లేక వసతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అలీ (16) బిహాక్ క్యాంప్ నుంచి బయలుదేరిన దాదాపు ఆరు నెలలుగా పాడుబడిన బస్సులోనే నిద్రిస్తున్నాడు.
తమను చూసుకోవడానికి ఎవరూ లేరని వాపోతున్నారు. ఇక్కడ పరిస్థితులు సురక్షితంగా లేవని తమ ధీన స్థితిని తెలియజేస్తున్నారు. మద్దతు ఇవ్వాల్సిన వ్యక్తులు వచ్చి తమ నుండి వస్తువులను తీసుకొని పోయారని తెలిపారు. ఆ వస్తువులను శిబిరం లోపల లేదా ఇతర ప్రాంతాలలో విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇక్కడ ఏమీ లేదని.. దయచేసి ఎవరైనా మాకు సహాయం చేయండంటూ కోరుతున్నారు. బోస్నియాలో సుమారు 8,000 మంది వలసదారులు ఉన్నారు. రాజధాని సారాజేవో చుట్టూ 6,500 మంది శిబిరాల్లో గడుపుతున్నారు. క్రొయేషియా వాయువ్య సరిహద్దులో ఉన్నారు. వలసదారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా బోస్నియా అధికారులను కోరారు.
బోస్నియాలోని సెర్బ్ క్రోయాట్ ఆధిపత్య ప్రాంతాలు ఎలాంటి వలసదారులకు వసతి కల్పించడానికి నిరాకరిస్తున్నాయని తెలిపారు. గత వారం వరకు, 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపా సమ్మర్ క్యాంప్ నిప్పంటించిన తరువాత అదనంగా 900 మందికి ఆశ్రయం లేకుండా పోయింది. వలసదారులకు ప్రత్యామ్నాయ వసతులను కల్పించమని యూరోపియన్ యూనియన్ అభ్యర్థనలు చేసినప్పటికీ బోస్నియన్ అధికారులు పట్టించుకోలేదు. నెలల తరబడి వేచి చూసిన తర్వాత ఇప్పుడు సైనిక గుడారాల పడకలను అందించారు.