Abu Dhabi: మోదీ చేతుల మీదుగా అబుదాబిలో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్‌ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు.

Abu Dhabi: మోదీ చేతుల మీదుగా అబుదాబిలో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభం

PM Modi

అరబ్‌ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్‌ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం మందిరంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయత, శిల్పకళ ఉట్టిపడేలా నిర్మితమైంది స్వామినారాయణ్‌ దేవాలయం. పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇది. ఈ ఆలయం ఎత్తు 32.92 మీటర్లు, పొడవు 79.86 మీటర్లు, వెడల్పు 54.86 మీటర్లుగా ఉంది. దేవాలయానికి ఏడు గోపురాలున్నాయి. ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌ పాలరాయిని వాడారు.

అబూ మారెఖ్ ప్రాంతంలో 27 ఎకరాల స్థలంలో నగరశైలిలో మందిరం నిర్మాణం ఉంటుంది. ఇక్కడి ప్రార్థనా మందిరంలో ఒకేసారి మూడు వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కమ్యూనిటీ సెంటర్, చిన్న పిల్లల పార్కు వంటివి ఏర్పాటు చేశారు. సనాతన ధర్మంలోని ఎనిమిది గొప్ప లక్షణాలకు చిహ్నంగా దేవాలయ ముఖద్వారాలపై ఎనిమిది శిల్పాలు తీర్చిదిద్దారు.

CM Revanth Reddy: రాబోయే పదేళ్లు సీఎం పదవిలోనే ఉంటాను.. ఎందుకంటే?: రేవంత్ రెడ్డి